కొండలు.. గుట్టలు దాటుకుంటూ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొండలు.. గుట్టలు దాటుకుంటూ

కొండలు.. గుట్టలు దాటుకుంటూ

Written By news on Thursday, January 22, 2015 | 1/22/2015


కొండలు.. గుట్టలు దాటుకుంటూ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రాక కోసం గత కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న మూడు గ్రామాలు బుధవారం ఆమె రాకతో పులకించి పోయాయి. చింతపల్లి మండలం మదనాపురం, చందంపేట మండలం దేవరచర్ల, గువ్వలగుట్ట గ్రామాల్లో షర్మిల పరామర్శ యాత్ర సందర్భంగా సందడి నెలకొంది. వైఎస్సార్ కుమార్తె తమ ప్రాంతానికి రావడంతో స్థానిక గిరిజనం ఆమెను తమ గుండెలకు హత్తుకుంది. వైఎస్‌పై ఉన్న అభిమానాన్ని, ప్రేమ కలిసి అడుగడుగునా షర్మిలకు ఘనస్వాగతం పలికించాయి. వైఎస్ కుటుంబంపై దేవరకొండ ప్రాంతానికి ఉన్న ప్రేమను చాటిచెప్పాయి.

 తొలిరోజు ప్రయాణం సాగిందిలా....
 సరిగ్గా ఉదయం 11:20 గంటలకు షర్మిల మాల్ చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. అనంతరం చింతపల్లి మండలం మదనాపురం వెళ్లిన ఆమె ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి స్థానికులు షర్మిలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొండమల్లేపల్లి వద్దకు రాగానే ఆమె కోసం ఎదురుచూస్తున్న జనాన్ని పలుకరించారు. వారినుద్దేశించి కాసేపు మాట్లాడారు. తర్వాత అక్కడి నుంచి దేవరకొండకు చేరుకున్నారు. బస్టాండ్‌సెంటర్‌లో పెద్ద ఎత్తున గుమికూడిన జనాన్ని ఉద్దేశించి ఆమె కొంతసేపు మాట్లాడారు. దేవరకొండ పట్టణంలో ప్రజలు షర్మిలను చూసేందుకు ఎగబడ్డారు.

 ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అక్కడి నుంచి చందంపేట మండలానికి వెళ్లే మార్గమధ్యలో భోజనం చేసిన ఆమె నేరుగా కేతావత్ హనుమానాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు దేవరచర్ల వెళ్లారు. అక్కడ స్థానిక గిరిజనులు ఆమెకు ఎదురేగి నృత్యాలు చేస్తూ ఆమెను తోడ్కెళ్లారు. హనుమా ఇంటివద్ద షర్మిలను చూసేందుకు, ఆమెతో మాట్లాడేందుకు గ్రామస్తులు పోటీలు పడ్డారు. ఆమెకు పూలమాలలతో స్వాగతం పలికారు. గిరిజన వస్త్రాలను ఇచ్చి ధరించాలని కోరగా, షర్మిల ఆ వస్త్రాలను ధరించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హనుమా కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆమె గువ్వలగుట్టకు వెళ్లారు. అక్కడకు వెళ్లే సమయంలో దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజ లు స్వాగతం పలికారు. గువ్వలగుట్ట ఊరిబయటే స్థానికులు ఆమెకు స్వాగతం పలికి వైఎస్సార్ తనయను తమ గ్రామంలోకి తీసుకెళ్లారు. అక్కడ రమావత్ బీమిని కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

 ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు.  అప్పటికే రాత్రి ఏడున్నర గంటలయింది. అయినా గ్రామస్తులు షర్మిలకోసం అక్కడే వేచి ఉన్నారు. ఆ తర్వాత గువ్వలగుట్ట నుంచి కాచరాజుపల్లి మీదుగా షర్మిల దే వరకొండకు వెళ్లారు. అప్పుడు కూడా మార్గమధ్యలోని తండాలు, గ్రామాల ప్రజలు షర్మిలను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. మొత్తంమీద షర్మిల వెళ్లిన ప్రతి చోటా మార్గమధ్యంలో కలిసిన ప్రజలు ఆమెను ఉత్సాహంగా పలకరించారు. ప్రతి గ్రామంలోనూ స్థానికులు రోడ్డు మీదకు వచ్చి ఆమె రాకకోసం ఎదురుచూశారు. షర్మిల కూడా వారిని నిరాశ పర్చకుండా తన వాహనం దిగి మరీ అందరినీ పలుకరించారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అందరినీ ఆత్మీయంగా చేతులూపుతూ పలుకరిస్తూనే తొలిరోజు మూడు కుటుంబాల పరామర్శ కార్యక్రమాన్ని షర్మిల పూర్తిచేశారు.

 ఒక్కో కుటుంబంతో అరగంటకు పైగానే...
 తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల సభ్యులతో షర్మిల ఆత్మీయంగా గడిపారు. కుటుంబ సభ్యులందరినీ ఆమె పేరుపేరునా పలకరించి వారి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో కుటుంబంతో ఆమె దాదాపు అరగంట కన్నా ఎక్కువగానే గడిపారు. చిన్నా, పెద్దా, పిల్లలు, యువకులు... ఇలా అందరితో ఆమె మాట్లాడారు. పిల్లలు చదువుకుంటున్నారా.. లేదా? ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా? ఎలా జీవిస్తున్నారు? వారికి ఉన్న సమస్యలేంటి? అనే విషయాలను అందరితో అడిగి తెలుసుకున్నారు.

 వైఎస్సార్ కోసం కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి కుటుంబాలకు తమ కుటుంబం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. షర్మిల రాకతో ఆ కుటుంబాల్లో కొండంత సంతోషం నెలకొంది. షర్మిల పరామర్శ యాత్రలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నేతలు కొండారాఘవరెడ్డి, ఎడ్మకిష్టారెడ్డి, నల్లాసూర్యప్రకాశ్, శివకుమార్,భీష్య వీరేందర్ తదితరులతో పాటు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, వడ్లోజు వెంకటేశం, గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమా ర్, బెదరకోట భాస్కర్, సిరాజ్  పాల్గొన్నారు.
Share this article :

0 comments: