రాజధాని రైతులకు ‘శంకుస్థాపన’ కష్టాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధాని రైతులకు ‘శంకుస్థాపన’ కష్టాలు

రాజధాని రైతులకు ‘శంకుస్థాపన’ కష్టాలు

Written By news on Monday, October 26, 2015 | 10/26/2015


రాజధాని రైతులకు ‘శంకుస్థాపన’ కష్టాలుఉండవల్లి పరిధిలోని పొలాల్లో వేసిన రోడ్డును తొలగించుకుంటున్న రైతులు
♦ వేసిన రోడ్లు తొలగిస్తామని అప్పట్లో అధికారుల హామీ
♦ ఇప్పుడు తొలగిస్తున్న రైతులపై కేసులు

సాక్షి, విజయవాడ బ్యూరో/తాడేపల్లి రూరల్: రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం.. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతుల పొలాల్లో ఆఘవేఘాలపై రోడ్లు వేసిన ప్రభుత్వ యంత్రాంగం పబ్బంగడుపుకుని దాన్ని వదిలేసింది. పంట వేసుకునే సమయం కావడంతో మందడం, పెనుమాక, వెంకటపాలెం గ్రామాల రైతులే వ్యయ ప్రయాసలకోర్చి రోడ్లను తొలగించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. శంకుస్థాపకు వీఐపీ(ఏఏ, ఏ) పాస్‌లు ఉన్న వాహనాలు వెళ్లేందుకు కృష్ణా కరకట్టకు అనుసంధానంగా రైతుల పొలాల్లోంచి యుద్ధ ప్రాతిపదికన కొత్త రోడ్లు వేశారు.

ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని తమ భూముల్లోంచి రోడ్డు వేయడంపై అప్పట్లో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అధికారులు రైతులకు నయానా భయానా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. కార్యక్రమానికి వీఐపీలు వచ్చేందుకు రోడ్డు వేస్తున్నామని, కార్యక్రమం పూర్తయ్యాక రోడ్డును తొలగిస్తామని హామీ ఇచ్చారు.

శంకుస్థాపన ముగిసి రోజులు గడుస్తున్నా రోడ్డు తొలగించకపోవడంతో తాము గుంటూరు ఎస్పీ నారాయణనాయక్‌ను కలిసినట్టు పెనుమాకకు చెందిన రైతు ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఉల్లి పంటను వేసుకోవాల్సి ఉన్నందున పొలంలోని రోడ్డును తొలగించాలని కోరినట్టు వివరించాడు. పొలంలో వేసిన యాస్, మెటల్‌తో వేసిన రోడ్డును తొలగించి సాగుకు అనువుగా మలుచుకునేందుకు వ్యయప్రయాసలు తప్పడంలేదని ఆయన వాపోయాడు.

రైతులపై అధికారుల ఫిర్యాదు
శంకుస్థాపన సమయంలో రోడ్ల ఏర్పాటుకు బతిమిలాడిన అధికారులే.. ఇప్పుడు వాటిని తొలిగిస్తున్నారంటూ రైతులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు పెనుమాక రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రే తమ పంటపొలాలను నాశనం చేసి రహదారులను నిర్మించార ని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నాశనం చేసినందుకు నష్ట పరిహారం ఇవ్వకపోగా, తమపై తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ల్యాండ్‌పూలింగ్‌కి తమ భూమలు ఇవ్వనందునే, పంచాయతీరాజ్ ఏఈ తమపై ఫిర్యాదు చేశారని వారు స్పష్టం చేశారు.
Share this article :

0 comments: