కష్టాలు వినేందుకు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కష్టాలు వినేందుకు...

కష్టాలు వినేందుకు...

Written By news on Monday, October 20, 2014 | 10/20/2014


కష్టాలు వినేందుకు...
శ్రీకాకుళం అర్బన్:హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు, వారి కష్టాలు తెలుసుకుని ప్రభుత్వం నుంచి సాయం అందేలా పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో సోమవారం నుంచి పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారమే జిల్లాకు వస్తారని నాయకులు భావించారు. అయితే, విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో బాధితులను పరామర్శించడంలో ఆలస్యం జరిగింది.

 జిల్లాలోని నాగావళి, వంశధార నదుల వరదలతో నాశనమైన పంట పొలాలను పరిశీలిస్తారు. బాధిత రైతులను ఓదార్చుతారని ఆమె తెలిపారు. పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్‌తో పాటు జిల్లాలోని పది నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, రాష్ట్ర నాయకులు ఆదివారం సమావేశమై జగన్ పర్యటనపై చర్చించారు. పర్యటన వివరాలను వెల్లడించారు.

 పర్యటన వివరాలివి...
 పర్యటన వివరాలివి...
  సోమవారం మధ్యాహ్నం  నాలుగు గంటలకు విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.
  ఐదు గంటలకు లావేరు మండలం సుభధ్రాపురం జంక్షన్ చేరుకుంటారు.
  ఆరు గంటలకు శ్రీకాకుళం పట్టణానికి చేరుకొని నాగావళి వరద ముంపునకు గురైన పట్టణంలోని తురాయిచెట్టువీధికి చేరుకుంటారు. అక్కడి బాధితులను పరామర్శిస్తారు.
  సోమవారం రాత్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు.
  మంగళవారం ఉదయం 8 గంటలకు అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుంటారు.
  అక్కడి నుంచి తొమ్మిది గంటలకు శ్రీకాకుళం మండలంలోని పెదగణగళ్లవానిపేట చేరుకొని బాధితులను పరామర్శిస్తారు.

  మధ్యాహ్నం రెండు గంటలకు ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో కింతలి, కనిమెట్ట, సింగూరు కూడలి, బొడ్డేపల్లి, మొదలవలస, బెలమాం, తాడివలస, లచ్చయ్యపేట, రామరాయపురం, వాసుదేవపట్నం వయా సంతకవిటి మండలంలోని  సిరిపురం గ్రామాల్లో పర్యటించి అక్కడి బాధితులను పరామర్శిస్తారు.
  అక్కడి నుంచి శ్రీకాకుళం చేరుకొని మంగళవారం రాత్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
  బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం మండలం ఒప్పంగి గ్రామం వెళ్లి బాధితులను పరామర్శిస్తారు.

  అక్కడి నుంచి 10 గంటలకు గార మండలం తూలుగు జంక్షన్‌కు చేరుకుని బాధితులను పరామర్శిస్తారు.
  ఒంటి గంటకు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని జీరుపాలెం, వెంకటాపురం, బుడగట్లపాలెం గ్రామాల్లో పర్యటించి తుపాను బాధితులను పరామర్శించనున్నారు.
  అనంతరం మూడు గంటలకు విశాఖపట్నం బయలుదేరుతారు.
Share this article :

0 comments: