అప్పుడు వచ్చిన పెట్టుబడులు రెండు శాతమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పుడు వచ్చిన పెట్టుబడులు రెండు శాతమే

అప్పుడు వచ్చిన పెట్టుబడులు రెండు శాతమే

Written By news on Wednesday, February 18, 2015 | 2/18/2015


'అప్పుడు వచ్చిన పెట్టుబడులు రెండు శాతమే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో మినీ జపాన్ ఏర్పాటు చేయడానికి జపాన్ కంపెనీలు సిద్ధం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కొన్ని పత్రికల్లో రాయించుకుంటున్నారంటూ వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు 9ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు వేల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నా.. వచ్చింది కేవలం 2శాతం పెట్టుబడులేనని అన్నారు.


బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పేది కొండంత.. చేసేది గోరంత అని చెప్పారు. చంద్రబాబుకు విదేశీ పారిశ్రామిక వేత్తలంటే ఎందుకంత మోజు.. మన పారిశ్రామికవేత్తలంటే ఎందుకంత చిన్నచూపు అంటూ దుయ్యబట్టారు. విదేశీయులతో రహస్య ఒప్పందాలు ఏమైనా చేసుకుంటున్నారా ? అంటూ అంబటి ఘాటుగా ప్రశ్నించారు. జపాన్ లో భూకంపాలు వస్తూంటాయి.. ఇక్కడ కూడా భూకంపాలు తీసుకొస్తుంటారా ? అంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: