రైతులను మరచిన బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులను మరచిన బాబు

రైతులను మరచిన బాబు

Written By news on Friday, February 20, 2015 | 2/20/2015


రైతులను మరచిన బాబు: పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజధాని పేరుతో దేశాలు పట్టుకు తిరుగుతున్నారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే డిమాండ్‌తో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్‌రెడ్డి కావలిలో మూడురోజుల నిరాహారదీక్ష చేపట్టారు.

ఏరియా ఆస్పత్రి సెంటర్‌లో గురువారం ఉదయం చేపట్టిన నిరాహారదీక్షకు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, రైతుసంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. చంద్రబాబు పాలన పై ఎంపీ, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
 
 దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం తిరుగుతున్నానంటూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కనపెట్టారన్నారు. చిత్తూరు జిల్లాలో ఎనిమి ది నియోజకవర్గాల్లో తాగటానికి నీరులేదని, తంబళ్లపల్లి నియోజకవర్గంలో 1,300 అడుగులు బోరు వేసినా నీరు రావడంలేదని చెప్పా రు. సీఎం చంద్రబాబు ఆప్రాంతంలో నీరు-చెట్టు పేరుతో పైలాన్ ఆవిష్కరించటం ఆయన తీరుకు నిదర్శనమన్నారు.నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడు తూ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిం చేందుకు వైఎస్సార్ ఎంతో కృషిచేశారని చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్టచతుష్టయ పాలన సాగుతోందని చెప్పారు.సుజనాచౌదరి, నారాయణ, పరకాల ప్రభాకర్, సీఎం రమేష్, సీఎం బాబు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: