మీకు మీడియా అంటే ఎందుకంత భయం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీకు మీడియా అంటే ఎందుకంత భయం?

మీకు మీడియా అంటే ఎందుకంత భయం?

Written By news on Friday, February 20, 2015 | 2/20/2015


మీకు మీడియా అంటే ఎందుకంత భయం?
హైదరాబాద్:మీడియా స్వేచ్ఛను తెలంగాణ సర్కారు అడ్డుకోవాలని చూస్తుండటంతో తెలంగాణ వైఎస్సార్ సీపీ మండిపడింది. మీడియాపై తెలంగాణ సర్కార్ ఆంక్షలు విధించడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగంలు విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా అంటే భయపడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ కు మీడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. మీ నిర్ణయాన్ని తక్షణమే మార్చుకుని పాలనపై దృష్టి పెట్టాలన్నారు.
 
సచివాలయంలో మీడియాకు ‘నో ఎంట్రీ’... అంటూ గతంలో ఎన్నడూ లేని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే రోజువారీ పరిపాలనా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తున్నారనే సాకుతో పాత్రికేయులను లోపలకు రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తుండటంతో సర్వత్రా  విమర్శలకు దారి తీస్తోంది.
Share this article :

0 comments: