Home »
» వారికి పంట వేసుకునే అవకాశమివ్వాలి: ఆర్కే
వారికి పంట వేసుకునే అవకాశమివ్వాలి: ఆర్కే
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు స్వచ్ఛందంగా పొలాలను ఇచ్చిన రైతులకూ పంట వేసుకునే అవకాశమివ్వాలని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో భూములివ్వబోమని 9.2 ఫారం (అభ్యంతర పత్రం) దాఖలు చేసిన రైతులు పంటలు వేసుకోవచ్చని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. స్వచ్ఛందంగా పొలాలిచ్చిన వారికీ ఈ అవకాశం కల్పించాలని కోరారు.బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంవద్ద ఆర్కే మీడియాతో మాట్లాడుతూ ఇకపై పంటలు వేసుకోరాదని శ్రీకాంత్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఇప్పుడు శ్రీకాంత్‌కు, సీఎం చంద్రబాబుకు బుద్ధి వచ్చినట్లుగా ఉంది..అందుకే పంటలు వేసుకునేందుకు అనుమతించే విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా ఉంది’ అని అన్నారు.
0 comments:
Post a Comment