ఈనెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర

ఈనెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర

Written By news on Tuesday, April 7, 2015 | 4/07/2015


'ఈనెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర'
హైదరాబాద్: వచ్చే వారంలో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర చేపడుతున్నట్లు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్ సీపీ బస్సు యాత్రకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్ సీపీ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 15వ తేదీన రాజమండ్రి నుంచి బస్సుయాత్ర ఆరంభం కానుందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పరిశీలించేందుకు మూడు రోజుల యాత్రను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ యాత్రలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొంటారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు రైతుల స్థితిగతులను తెలుసుకునేందుకు వారితో ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ధవళేశ్వరం, పోలవరం, పట్టిసీమ, కృష్ణా బ్యారేజ్, వెలుగొండ, బనకచర్ల, పోతిరెడ్డి, హంద్రీనీవా ప్రాజెక్టులను పరిశీలిస్తామన్నారు. వైఎస్సార్ మరణాంతరం ప్రాజెక్టులపై ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే తమ బస్సుయాత్ర ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: