ప్రత్యేక హోదాపై మౌనం ఎందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదాపై మౌనం ఎందుకు?

ప్రత్యేక హోదాపై మౌనం ఎందుకు?

Written By news on Monday, April 6, 2015 | 4/06/2015


ప్రత్యేక హోదాపై మౌనం ఎందుకు?
  • వైఎస్సార్‌సీపీ సూటి ప్రశ్న
  • ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు
  • తీసుకోవడం లేదని నిలదీసిన బుగ్గన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో ఎందుకు గట్టిగా పోరాడలేకపోతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని, అసలు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారో లేదో కూడా తెలియని గందరగోళ పరిస్థితి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మన రాష్ట్రానికి ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ప్రత్యేక హోదా ఇచ్చే విషయం పరిశీలనలో ఉందని చెప్పారని, మరో మంత్రి ఇంకా చూస్తున్నాం అని చెబుతున్నారని తెలిపారు. ఈ గందరగోళం అంతా ఎందుకు? అసలు టీడీపీ ప్రభుత్వం ఈ అంశంపై కే ంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేకపోతోందని ప్రశ్నించారు. అసలు విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఉందా లేదా అని ప్రశ్నించారు.

విభజన చట్టంపై రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న జరిగిన చర్చ సందర్భంగా మిగిలిపోయిన 13 జిల్లాలకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారని, బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చేది తామే కనుక పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చిన అప్పటి కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కూడా ఈ విషయాలను ధ్రువీకరిస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలుసార్లు కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారని చెప్పారు.
 
అన్నీ అనుమానాలే..

రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం టెండర్లలో లోపాలు, అధికార దుర్వినియోగం వంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం మన హక్కుల సాధనకు గట్టిగా కృషిచేయడం లేదనేది స్పష్టం అవుతోందని రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఏడాదిలో పూర్తికావాల్సిన పట్టిసీమ ప్రాజెక్టుకు బోనస్ రూపంలో టెండరును పెంచి ఇవ్వడంతో పాటుగా సింగపూర్ సంస్థతో, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థతో ఒప్పందాలు చేసుకోవడంలో అనేక లోపాలున్నాయని చెప్పారు.
Share this article :

0 comments: