కమీషన్ కాకతీయగా మార్చొద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కమీషన్ కాకతీయగా మార్చొద్దు

కమీషన్ కాకతీయగా మార్చొద్దు

Written By news on Wednesday, April 8, 2015 | 4/08/2015


కమీషన్ కాకతీయగా మార్చొద్దు
  • అవినీతికి ఆస్కారమివ్వొద్దు: వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్:  చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ కార్యక్రమం కమీషన్ కాకతీయ, గ్రాండ్ కాకతీయగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులకు ప్రయోజనం కలిగించేవిధంగా కమీషన్ల వ్యవహారంగా, పార్టీ కార్యక్రమంగా ముద్రపడకుండా చూడాలని సూచించింది. మంగళవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధానకార్యదర్శులు శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి మీడియాతో మాట్లాడారు.

మిషన్ కాకతీయ పనులు మొదలుపెట్టగానే అవకతవకలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని చెప్పారు. రైతులకు దీర్ఘకాల ప్రయోజనాలు చేకూరేలా శాస్త్రీయకోణంలో మిషన్ కాకతీయ పనులు చేయాలని సూచించారు. మిషన్ కాకతీయలో ఒక్క రూపాయి అవినీతికి కూడా తావివ్వొద్దని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సూచించారు. దీనిని కమీషన్ల కార్యక్రమంగా నిర్వహించినా, ఎక్కడైనా అవకతవకలు జరిగినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకుంటారని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: