పక్క రాష్ట్రాల్లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల విస్తీర్ణం 2 వేల ఎకరాలు మించలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పక్క రాష్ట్రాల్లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల విస్తీర్ణం 2 వేల ఎకరాలు మించలేదు

పక్క రాష్ట్రాల్లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల విస్తీర్ణం 2 వేల ఎకరాలు మించలేదు

Written By news on Thursday, April 23, 2015 | 4/23/2015


ఎయిర్‌పోర్టుకు15 వేల ఎకరాలా?బుధవారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • ‘భోగాపురం’పై ప్రభుత్వాన్ని నిలదీసిన
  • ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
  • రైతుల పొట్టకొట్టేందుకే ల్యాండ్‌పూలింగ్ పేరుతో భూసమీకరణ
  • ప్రభుత్వానివి దిక్కుమాలిన ఆలోచనలు
  • పక్క రాష్ట్రాల్లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల విస్తీర్ణం
  • 2 వేల ఎకరాలు మించలేదు
  • సీఎం వైఖరి మారేంత వరకూ రైతుల పక్షాన పోరాడుతాం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:  విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రైతులనుంచి 15 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌పూలింగ్ కింద సమీకరించడం అన్యాయమని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతుల పొట్టకొట్టి వేల ఎకరాల భూమిని సమీకరించడం ఎంతవరకు ధర్మమని సీఎంను ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వానివి దిక్కుమాలిన ఆలోచనలుగా మండిపడ్డారు. జిల్లాలో రెండురోజుల పర్యటనకోసం బుధవారం విజయనగరం వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని స్థానిక జిల్లాపరిషత్ అతిథిగృహంలో జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు కలిశారు.

ఈ సందర్భంగా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కోసం అన్యాయంగా భూసేకరణ చేస్తున్న విషయాన్ని స్థానిక నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు తదితరులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతులనుంచి భూములను పెద్ద మొత్తంలో సేకరించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1,283 ఎకరాల్లో, కొచ్చి విమానాశ్రయాన్ని 800 ఎకరాల్లో, ముంబై విమానాశ్రయాన్ని 2000 ఎకరాల్లో ఏర్పాటు చేశారంటూ.. భోగాపురం మండలంలో వేల ఎకరాల భూమిని సేకరించటం అన్యాయమన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ అందుకు సరిపోతుందా? లేదా? అన్నవిషయాన్ని అధ్యయనం చేయాలన్నారు.

ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్ మధ్యాహ్నం వేళల్లో వెలవెలబోతున్నదన్న ఆయన.. అక్కడి 350 ఎకరాలు చాలవనుకుంటే మరో 1000 ఎకరాల భూమిని సేకరించి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విశాఖ జిల్లా భీమిలికి అత్యంత సమీపంలో, సముద్రతీరంలో ఉన్న భోగాపురం మండలంలో ఎకరా విలువ రూ.2కోట్ల మేర పలుకుతుందని, అటువంటి భూముల్ని ల్యాండ్‌పూలింగ్ పేరుతో లాక్కొని 1000 లేదా 1500 గజాల భూమినిస్తే వారంతా ఎక్కడికెళ్లాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు సరికదా.. ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేస్తున్నారని జగన్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి మారాలంటూ.. అప్పటివరకు రైతులపక్షాన పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ను కలసిన వారిలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులున్నారు.
అజ్మీర్ వేడుకలకోసం చాదర్
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖలోని మర్రిపాలెంలో ముస్లింలు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 25న అజ్మీర్‌లో జరగనున్న హజ్రత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా ఉరుసు(చందనోత్సవం) వేడుకలకు నగరం నుంచి చాదర్(పవిత్ర వస్త్రాన్ని) సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఆయన  చేతుల మీదుగా చాదర్‌ను ముస్లిం పెద్దలకు అందజేశారు.
నేడు కడపకు వైఎస్ జగన్.. 24న శోభా నాగిరెడ్డి వర్థంతికి హాజరు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఆ మరుసటి రోజు 24వ తేదీన ఆళ్లగడ్డలో జరిగే దివంగత శోభా నాగిరెడ్డి తొలి వర్థంతికి హాజరవుతారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారని బుధవారం పార్టీ వర్గాలు తెలిపాయి.
వైఎస్సార్‌సీపీలోకి కర్నూలు కాంగ్రెస్ నేతలు
కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డితో పాటు పలువురు నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలోకి అడుగుపెట్టారు. వారందరికీ జగన్.. పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
Share this article :

0 comments: