24న శోభా నాగిరెడ్డి వర్ధంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 24న శోభా నాగిరెడ్డి వర్ధంతి

24న శోభా నాగిరెడ్డి వర్ధంతి

Written By news on Wednesday, April 22, 2015 | 4/22/2015


24న శోభా నాగిరెడ్డి వర్ధంతిశోభా నాగిరెడ్డి (ఫైల్ ఫొటో)
హైదరాబాద్: ఈ నెల 24న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దివంగత భూమా శోభా నాగిరెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు.

 2014  ఏప్రిల్ 23న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పటి ఆళ్లగడ్డ శాసనసభ్యురాలైన శోభా నాగిరెడ్డి తీవ్రంగా గాయపడి, 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1997లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి శోభానాగిరెడ్డి ప్రజాసేవకు అంకితమయ్యారు.
Share this article :

0 comments: