వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కమిటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కమిటీ

వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కమిటీ

Written By news on Friday, April 24, 2015 | 4/24/2015


వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కమిటీహైదరాబాద్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో వైఎఆర్‌స్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ శుక్రవారం ఏర్పాటయ్యింది. మొత్తం 103 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అమెరికాలోని పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులను వివిధ పదవులలో నియమించినట్లు ఆ ప్రకటన తెలియజేసింది.

సి. మధులిక, పి. రత్నాకర్, పి. గురవా రెడ్డి, కె. రాజశేఖర్ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సి. సుబ్బారెడ్డి (ట్రెజరర్), డా. రామి ఆర్ బుచ్చిపూడి (సోషల్ రెస్పాన్సిబిలిటీ), డా. జి. ధనుంజయ (మీడియా), రంగరాజు (వెబ్ కంటెంట్), వి.శ్రీనివాస్ (సోషల్‌మీడియా), సి. రాజశేఖర్ (ఎంటర్‌ప్రెన్యూర్స్), కె. విశ్వనాథ్(వెబ్‌సైట్), డా.డి.నాగిరెడ్డి (ఐటీ) నియమితులయ్యారు. నలుగురితో సలహా సంఘం, ఆరుగురితో గవర్నింగ్ కమిటీ ఏర్పాటయ్యాయి. ప్రాంతాల వారీగా ఏర్పడిన టీమ్‌లలో మిగిలినవారు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
Share this article :

0 comments: