పార్లమెంట్‌లోనూ చర్చిస్తానని హామీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్లమెంట్‌లోనూ చర్చిస్తానని హామీ

పార్లమెంట్‌లోనూ చర్చిస్తానని హామీ

Written By news on Sunday, April 19, 2015 | 4/19/2015


ఎట్లా బతికేది?
  • పంట నష్టంతో కుంగిపోయిన రైతన్న
  • సర్కార్ సాయం కోసం ఎదురుచూపు
  • కరీంనగర్ జిల్లాలో పర్యటించిన పొంగులేటి
  • అన్నదాతను ఓదార్చే యత్నం..
  • అండగా ఉంటామని భరోసా
  • పార్లమెంట్‌లోనూ చర్చిస్తానని హామీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అకాల వర్షం అన్నదాతను కుంగదీసింది. ఈదురుగాలులు, వడగళ్ల వానకు తెలంగాణలో సుమారు లక్షన్నర ఎకరాల్లో పంట న ష్టం వాటిల్లింది. అందులో కరీంనగర్ జిల్లాకు జరిగి న నష్టం అపారం. ఈ జిల్లాలోనే ఇప్పటి వరకు 62 వేల ఎకరాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశా రు. ఆస్తి, పశు సంపదతో కలిపి సుమారు రూ. 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంట నష్టా న్ని పరిశీలించేందుకు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, చొప్పదండి ని యోజకవర్గాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని దాదాపు 30 వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు.

అకాలవర్షానికి నష్టపోయిన వందలాది మంది రైతులను కలిసి వారి గోడును విన్నారు. ఈ సందర్భంగా ఏ రైతును కదిలించినా కన్నీళ్లే దర్శనమిచ్చాయి. ‘చేతికొచ్చే పంట వడగళ్ల దెబ్బకు మట్టిపాలాయే.. పెట్టిన పెట్టుబడి రాకపా యే... చేసిన అప్పులు తీరకపాయే... ఇంకా ఎట్లా బతికేది’ పొంగులేటి ఎదుట రైతులు  భోరుమన్నా రు. రైతుల దుస్థితిని చూసి చలించిన పొంగులేటి వారిని ఓదార్చారు. ‘పెద్దమ్మా... పెద్ద య్యా... మీరు బాధ పడొద్దు... చావు పరిష్కారం కాదు. ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగేలా చేస్తా. 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తా’అని భరోసా ఇచ్చారు.

 నేలరాలిన పంట: కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టిన పొంగులేటి వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి తొలుత  మల్యాల మండలం మానాలలోని వరి చేల ను పరిశీలించారు. వడగళ్ల వానకు వరి పంట ధాన్యమంతా నీటిపాలైన దృశ్యాలే కన్పించాయి. అక్కడే ఉన్న కాసునోళ్ల గంగవ్వ అనే రైతు ‘సారూ.. అప్పు తెచ్చి మూడెకరాల్లో వరి వేసిన. వడగండ్ల వానొచ్చి మా నోట్ల మట్టి కొట్టిపాయె. తెచ్చిన అప్పు తీర్చేదెట్లా... బతికేదెట్ల?’ అని భోరున విలపించింది.

మానాల నుంచి జగిత్యాల మండలం నర్సింగాపూర్, చల్‌గల్ రాయికల్ మండలం కిష్టంపేట గ్రామాల్లోని పంట పొలాలకు వెళ్లారు. బాడిశెట్టి లచ్చయ్య,  పెదాల చిన్నభూమయ్య, బక్కశెట్టి రాజిరెడ్డి, మగిశెట్టి లచ్చుసహా పలువురు రైతు నేలరాలిన నువ్వుల పంటను, వడగళ్ల దెబ్బకు నేలరాలిన మామిడి కాయలను చూపిస్తూ కంట తడిపెట్టారు. ‘సర్కారోళ్లు సాయం చేయకుంటే ఇక మా చావడమే మేలు’ అంటూ భోరుమన్నారు. కిష్టంపేట నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలానికి వచ్చిన పొంగులేటి బృందం కట్లకుంట, తొంబర్రావుపేట గ్రామాల్లోని పొలాల్లోకి వెళ్లారు. ఆ ప్రాంతాల్లో కూలిన అరటి, బొప్పాయి చెట్లు, నేలకొరిగిన నువ్వులు, నేలపాలైన మామిడి కాయలను పరిశీలించారు.  విరిగిన అరటిచెట్లను పొంగులేటికి చూపిస్తూ రైతులు యార్ల రాజి రెడ్డి, మహేష్ ‘ఈ ఏడాది బాగా కాపుకొచ్చినయ్..  తీరాచూస్తే అరటి చెట్లన్నీ కళ్లముందే కూలిపాయే’అని కన్నీటి పర్యంతమయ్యారు.

పార్లమెంట్‌లో చర్చిస్తా: పొంగులేటి
రైతాంగానికి జరిగిన నష్టంపై రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తానని పొంగులేటి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడి పంట నష్టపోయిన రైతులకు నూటికి నూరుశాతం సాయం అందేలా కృషి చేస్తానన్నారు. జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మమేకమైన అనంతరం  మీడియాతో మాట్లాడుతూ దివంగ త సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంట నష్టం వాటిల్లితే తక్షణం పరిహారం ఇచ్చేవారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు వైఎస్ తరువాత వచ్చిన పాలకులెవరూ అన్నదాతకు అండగా నిలవడం లేదన్నారు.

రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి

కొత్తగూడెం: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే వరకు ప్రభుత్వం తో పోరాడుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. వరికి రూ. 15 వేలు, ఇతర పంటలకు రూ. 25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పినపాక ఎ మ్మెల్యే, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన పార్టీ  ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శనివారం నిర్వహించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

వైఎస్సార్‌సీపీ కా ర్యకర్తల కోసం రూ.50 లక్షలతో సంక్షేమ నిధిని ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు మాయ మాటలు చెప్పి ఇతరపార్టీల నాయకుల ను ప్రలోభాలకు గురిచేస్తూ తమ పార్టీలోకి రప్పించుకుంటున్నారని ఆరోపించారు. పాయం వెంకటేశ్వర్లుకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారలేదని గుర్తుచేశారు. 2019 నాటికి శాసనసభను శాసించే స్థాయికి వైఎస్సార్‌సీపీ ఎదుగుతుందన్నారు. ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిల్చోపెట్టి గెలిపించి పార్టీ సత్తా నిరూపిస్తామని అన్నారు.
Share this article :

0 comments: