ఒంగోలు జాతి పశు సంతతి పెంచండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒంగోలు జాతి పశు సంతతి పెంచండి

ఒంగోలు జాతి పశు సంతతి పెంచండి

Written By news on Thursday, April 23, 2015 | 4/23/2015

న్యూఢిల్లీ: అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవులు, గిత్తలను సంరక్షించి, వాటి సంతతిని పెంచాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువుల సంతతి పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఒంగోలు జాతి పశువుల సంతతిని బ్రహ్మణ పేరుతో విదేశాలు అభివృద్ధిచేశాయనీ నేషనల్ బయో డైవర్సిటీ యాక్ట్ ప్రకారం ఈ పశువుల జీవద్రవ్యాన్ని విదేశాలు తీసుకునేందుకు అనుమతి లేదన్నారు. అయితే ఇటీవల బ్రెజిల్ ఒంగోలు గిత్తల వీర్యాన్ని సేకరించేందుకు కేంద్రాన్ని కోరినట్టు తెలిసిందనీ కేంద్రం ఇందుకు అనుమతించరాదని  సుబ్బారెడ్డి కోరారు.

Share this article :

0 comments: