చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది

చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది

Written By news on Saturday, May 2, 2015 | 5/02/2015


'చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది'
విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందేమో అనే అనుమానం కలుగుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించడం వల్లే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాలేదని కొయ్య ప్రసాదరెడ్డి శనివారమిక్కడ మీడియా సమావేశంలో అన్నారు.

లోకేష్ ఏ హోదాలో విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకు వస్తానంటున్నారో అర్థం కావటం లేదని కొయ్య ప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్ర సంపదను లోకేష్ ద్వారా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇటీవల పారిశ్రామిక సదస్సులు పెట్టి పనికిరాని ఎంవోయూలు చేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసింది రైతు రుణమాఫీ కాదని, రైతు మాఫీ అని కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు.
Share this article :

0 comments: