నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గభేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గభేటీ

నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గభేటీ

Written By news on Saturday, May 2, 2015 | 5/02/2015


నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గభేటీ
హైదరాబాద్: లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కార్యాలయంలో శనివారం ఉదయం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఏడాది కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు ఇతర ముఖ్యాంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. వైఎస్సార్‌సీపీ టికెట్‌పై గెలుపొంది టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారంకూడా చర్చకు రానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.


ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలతోపాటు సంస్థాగత అంశాలపైకూడా చ ర్చిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధానకార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, రాష్ర్టకార్యవర్గ సభ్యులు, అధికార ప్రతిని ధులు, పదిజిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధవిభాగాల అధ్యక్షులు హాజరవుతారని తెలిపారు.
Share this article :

0 comments: