Home »
» ఎల్లుండి గవర్నర్ తో భేటీ కానున్న వైఎస్ జగన్
ఎల్లుండి గవర్నర్ తో భేటీ కానున్న వైఎస్ జగన్
హైదరాబాద్:వైఎస్సార్ సీపీ నేతలపై వరుసగా జరుగుతున్నదాడుల ఘటనలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్ తో సమావేశం కానున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్ సీపీ నేతలపై జరుగుతున్న దాడులను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. గత కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడుతహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ కు వైఎస్సార్ సీపీ విన్నవించే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment