తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపించాలి

తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపించాలి

Written By news on Sunday, July 26, 2015 | 7/26/2015

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు మొదలైన తొలిరోజే తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఘటనను మరిపించేందుకు అభినందన సభలు ఏర్పాటు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు మండిపడ్డారు.

ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పుష్కరాలు విజయవంతం అయ్యాయని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: