వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ దాడి

వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ దాడి

Written By news on Wednesday, July 29, 2015 | 7/29/2015

చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పెనమల్లంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరుతున్నాయి. యధేచ్చగా ఇసుక రవాణా చేయడమే కాకుండా దాన్ని అడ్డుకున్న కారణంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఇంతటితో ఆగకుండా వైఎస్ఆర్ సీపీ నేతలకు సంబంధించిన మూడు ఇళ్లను టీడీపీ వర్గీయులు కూల్చివేశారు. టీడీపీ నేతల దాడుల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు కృష్ణయ్య, హరిప్రసాద్, రాజేశ్వరి, మురళీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Share this article :

0 comments: