బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ

బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ

Written By news on Saturday, November 7, 2015 | 11/07/2015

► బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ
►ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు
►భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదు
►ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య (ఎల్బీనగర్‌ నియోజకవర్గం) నిప్పులు చెరిగారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు... ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని మండిపడ్డారు.
ఏపీలో లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి గ్రూప్1, 2,3, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. బాబు వస్తే ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో తొలగించిన 125 మంది కాంట్రక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: