ప్రతి అడుగులోనూ అవినీతి, లంచాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతి అడుగులోనూ అవినీతి, లంచాలు

ప్రతి అడుగులోనూ అవినీతి, లంచాలు

Written By news on Wednesday, January 27, 2016 | 1/27/2016


'ప్రతి అడుగులోనూ అవినీతి, లంచాలు'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రాజ్యం నడుస్తోందని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కాకినాడలో బుధవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్ని వర్గాలను సీఎం చంద్రబాబు వంచించారని విమర్శించారు. బేషరతుగా రుణాల మాఫీ చేస్తామని మోసం చేశారని అన్నారు. కమీషన్లు, లంచాలతో ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఇలాంటి మోసపూరిత సర్కారుకు చరమగీతం పాడాలన్నారు. సమిష్టిగా పోరాడి చంద్రబాబును సాగనంపుదామని పిలుపునిచ్చారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే
 • అబద్దాల కోరు, మోసాలు చేసిన వ్యక్తితో ఇవాళ మనం పోరాటం చేస్తున్నాం
 • సామాన్యుల దగ్గరికి వెళ్లి పాలన గురించి అడిగితే చంద్రబాబు మోసం చేశాడన్నా అంటూ సమాధానం వస్తోంది
 • మా రుణాలన్నీ బేషరుతుగా మాఫీ చేస్తానని మోసం చేశాడన్నా అంటూ అన్నదాతలు వాపోతున్నారు
 • డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడితే.. చంద్రబాబు మమ్మల్ని నట్టేట ముంచేశాడన్నా అంటున్నారు
 • నిరుద్యోగులను అడిగితే జాబ్ ఇవ్వలేకపోతే రూ. 2 వేలు భృతి ఇస్తానని దమ్మిడి కూడా ఇవ్వలేదన్నా అంటున్నారు
 • అవ్వతాతలను అడిగితే జన్మభూమి కమిటీలు వేసి పెన్షన్లు ఎలా ఊడబెరకాలా అని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడని చెబుతున్నారు
 • ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టిచ్చిన పాపాన పోలేదని అక్కాచెల్లెమ్మలు అంటున్నారు
 • ఇంతకుముందు నెల కరెంట్ బిల్ రూ. 200 వస్తే ఇప్పుడు రూ. 600 వస్తోంది
 • రుణాలన్నీ మాఫీ చేసేస్తానని రైతుల నోట్లో మట్టి కొట్టాడు
 • రబీ మొదలైనా ఇప్పటివరకు నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది
 • దేవుడు కూడా చంద్రబాబుకు మొట్టికాయ వేస్తాడు
 • కమీషన్లు, లంచాల కోసం పట్టిసీమ ప్రాజెక్టు కట్టాడు
 • ప్రతి అడుగులోనూ, ప్రతి విషయంలోనూ కరెప్షన్
 • ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి
 • పార్టీని బలోపేతం చేసేందుకు ముత్తా గోపాల కృష్ణ, శశిధర్, కన్నబాబులను చేర్చుకున్నాం
 • కన్నబాబు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకుంటాడు
 • ముత్తా శశిధర్ కు కాకినాడ టౌన్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తున్నా
 • వీరిద్దరూ కూడా వైఎస్సార్ సీపీ కుటుంబంలో సభ్యులు, రాబోయే  రోజుల్లో వారిద్దరికీ మంచి చేస్తాను
 • నాపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తున్న జిల్లా ప్రజలకు రుణపడివున్నా
Share this article :

0 comments: