బెదిరింపులు తగదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెదిరింపులు తగదు

బెదిరింపులు తగదు

Written By news on Thursday, January 21, 2016 | 1/21/2016


అచ్చెన్నా.. ఇదేం తీరు..
శ్రీకాకుళం అర్బన్: జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పోలాకి పంచాయితీ కార్యదర్శి త్రివేణి పట్ల అచ్చెన్న దురుసుగా వ్యవహరించడం, ఆమె ఆస్పత్రి పాలు కావడాన్ని పార్టీ నేతలు ఆక్షేపించారు. రాష్ర్టంలో టీడీపీ పాల ననే తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని, ప్రజాప్రతినిధులు తమ పరిధి దాటి వ్యవహరించడం బాధాకరమేనని వైఎస్సార్‌సీపీ నేతలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాంలు బుధవారం టౌన్‌హాల్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం వేర్వేరుగా విలేకరుల సమావేశంలో అచ్చెన్న తీరుపై మండిపడ్డారు.

 బెదిరింపులు తగదు
 ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చిరుద్యోగులపై బెదిరింపు ధోరణిలకు పాల్పడడం తగదన్నారు. అచ్చెన్న బెదిరింపులకు మహిళాకార్యదర్శి సృ్పహతప్పి ఆసుపత్రిపాలయ్యారని, మంత్రి వ్యవహరించిన తీరును పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తులు అధికారదుర్వినియోగానికి పాల్పడుతూ బెదిరించడం శోచనీయమన్నారు. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని, నిబంధనలు అందరికీ ఒకటేనన్నారు. మంత్రి ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. ఏ అధికారి అయినా తన బాధ్యతల్లో వైఫల్యం చెందితే వారిని శిక్షించేందుకు వారి పై అధికారులుంటారన్న విషయం అచ్చెన్న గుర్తించాలని హితవు పలికారు.

 అచ్చెన్న తన పద్ధతి మార్చుకోకపోతే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. పేరొందిన సద్దాం హుస్సేన్, నెల్సన్ మండేలా పరిస్థితి అందరికీ తెలియనది కాదన్నారు.  త్వరలోనే ఆయనకు ప్రజలు చరమగీతం పాడే రోజులొస్తాయన్నారు. ఉద్యోగుల కష్టాల్లో పాలుపంచుకునేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీయేనని, టీడీపీ చేస్తున్న దౌర్జన్యాల్ని పార్టీ ఖండిస్తుందని ధర్మాన అన్నారు. అదే విధంగా టీడీపీ పాలనకు రెండేళ్లవుతున్నా జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. నయాపైసా అయినా విదిల్చారా అని అడిగారు. ప్రాజెక్టుల్ని గాలికొదిలేశారని, రోడ్లు వేశారా, ఉద్యోగాలిచ్చారా, ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు.

 ఇదేనా పాలన?
 రాష్ట్రంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవరిస్తోందని, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడడం, అక్రమకేసులు బనాయించి జైళ్ళలో పెట్టడం తగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. అచ్చెన్నాయుడు అధికారమధంతో ఉన్నారని విమర్శించారు. టీడీపీకి చెందిన కార్యకర్త ఒకరు మరణిస్తే అందుకు సంబంధించి థృవీకరణ పత్రం ఇవ్వలేదని పోలాకి మండలం రహిమాన్‌పురం పంచాయితీ కార్యదర్శి హెచ్.త్రివేణిని మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఆమెను బెదిరించడం అచ్చెన్న అహంకారానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఒక సాధారణ మహిళా చిరుద్యోగిపై మంత్రి అచ్చెన్న తన ప్రతాపాన్ని చూపాలనుకోవడం తగదన్నారు.

 అచ్చెన్నాయుడులాంటి వ్యక్తులు మంత్రి కావడంతో ప్రభుత్వస్థాయి ఏమిటో అర్ధమవుతోందని విమర్శించారు. అంగన్‌వాడీలపై పోలీసులతో లాఠీఛార్జీ చేయించడం,తహసీల్దార్ వనజాక్షిపై దాడి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించినందుకు  రిమాండ్, కాల్‌మనీ కేసులో అసెంబ్లీలో ప్రశ్నించినందుకు రోజాపై  సస్పెన్స్ వేటు, ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్ట్ చేయడం ప్రభుత్వ దుశ్చర్యకు నిదర్శనమన్నారు. అచ్చెన్న తీరు దుర్మార్గంపార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పంచాయితీ కార్యదర్శి అయిన ఓ మహిళపై మంత్రి వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలపట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

 ప్రభుత్వం మహిళా వ్యతిరేఖ ప్రభుత్వమన్నారు. కాల్‌మనీ కేసుపై నిలదీసిన రోజాను సస్పెండ్ చేయడం, ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై భౌతికదాడి, అంగన్‌వాడీ ఉద్యోగులపై పోలీసులతో లాఠీఛార్జి చేయించడం వంటి అఃశాలు ప్రభు త్వ నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు, వఎం.వి.పద్మావతి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి,  చల్లా అలివేలు మంగ పాల్గొన్నారు.
Share this article :

0 comments: