ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట

ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట

Written By news on Tuesday, May 10, 2016 | 5/10/2016


ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ధర్నాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని కలెక్టరేట్‌ వద్ద ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ మంగళవారం ధర్నా చేపట్టింది. విశాఖ ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలో కూడా ప్రత్యేక హోదా కోసం కలెక్టరేట్‌ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా చేపట్టగా.. పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, డా.సునీల్‌ కుమార్‌, పార్టీ ఇంఛార్జ్‌లు జంగాలపల్లి నివాసులు, సురేష్‌, ద్వారకానాథ్‌ లు హాజరయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరులో చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పిళ్లంగోళ్ల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కర్నూలు: ప్రత్యేక హోదా కోరుతూ కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఐజయ్య, గౌరు చరిత, సాయి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, మురళి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డిలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. హోదా విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
నెల్లూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఉదయం నెల్లూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి, నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, యల్లసిరి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉదయం గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నేత అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం: ప్రత్యేక హోదా కోరుతూ కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డిశాంతి, తమ్మినేని, వరుదు కల్యాణి, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాస్, రామారావు, జుత్తు జగన్నాయకులు, సాయిరాజ్‌లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన హామీ ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగనాటకం ఆడుతున్నాయని ఈ సందర్భంగా నేతలు దుయ్యబట్టారు. నరేంద్రమోడి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

Share this article :

0 comments: