రైతుల్ని గాలికొదిలేసిన సర్కారు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల్ని గాలికొదిలేసిన సర్కారు: షర్మిల

రైతుల్ని గాలికొదిలేసిన సర్కారు: షర్మిల

Written By news on Thursday, November 8, 2012 | 11/08/2012


మద్దికెర: మహానేత వైఎస్సార్ బతికివుంటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవారని షర్మిల అన్నారు. రైతులు, మహిళల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని మద్దికెరలో గురువారం సాయంత్రం నిర్వహించిన సభలో షర్మిల ప్రసంగించారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలోని అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబే పెంచి పోషిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. అన్నివిధాలుగా విఫలమయిన ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. 

వెన్నుపోట్లు, అబద్దాలతో పబ్బం గడుపుకునే చంద్రబాబు జగనన్నపై బురద చల్లుతున్నారని అన్నారు. సమయం వచ్చినప్పడు కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని కోరారు. జగనన్న జైలు నుంచి బయటికి వచ్చి రాజన్న స్థాపిస్తాడన్నారు. రాజన్న రాజ్యంలో మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు వస్తాయి. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 700 ఫించను అందుతుందని చెప్పారు. రైతులను కోసం మూడు వేల కోట్లతో స్థిరీకరణతో నిధి ఏర్పాటవుతుందని తెలిపారు. పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తామన్నారు. తమపై ఆదరాభిమానాలు చూపుతున్న వారందరికీ షర్మిల ధన్యవాదాలు తెలిపారు.

source:sakshi
Share this article :

0 comments: