బాబు.. బోగస్ బాబా? దొంగ బాబా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు.. బోగస్ బాబా? దొంగ బాబా?

బాబు.. బోగస్ బాబా? దొంగ బాబా?

Written By news on Friday, January 3, 2014 | 1/03/2014

బాబు.. బోగస్ బాబా? దొంగ బాబా?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని కుప్పంలో బోగస్ ఓట్లతో గెలవడమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయరహస్యమని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు బోగస్ ఓట్లపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుని బోగస్ బాబు అనాలా? లేదా దొంగ బాబు అనాలా ? అని శ్రీకాంత్ రెడ్డి ఎద్దెవా చేశారు.

కుప్పం బోగస్‌ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. కాగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Share this article :

0 comments: