వాళ్లకు ఇచ్చినప్పుడు.. మాకెందుకు ఇవ్వరు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాళ్లకు ఇచ్చినప్పుడు.. మాకెందుకు ఇవ్వరు?

వాళ్లకు ఇచ్చినప్పుడు.. మాకెందుకు ఇవ్వరు?

Written By news on Monday, August 10, 2015 | 8/10/2015


వాళ్లకు ఇచ్చినప్పుడు.. మాకెందుకు ఇవ్వరు?
న్యూఢిల్లీ : రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు.. ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త బంద్ పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని చెప్పినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
  • రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సవ్యసాచుల్లా విచ్చేసిన ప్రతి అన్నకు, తమ్ముడికి, ప్రతి అక్కకు, చెల్లెలికి, ప్రతి అవ్వకు, తాతకు శిరసు వంచి, చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశంపై మనకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలిపేందుకు ఢిల్లీ వీధుల్లో మన స్వరం వినిపించేందుకు వచ్చాం.
  • రాష్ట్రాన్ని విభజించిన రోజు ఏం జరిగింది.. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టకండి అని మొత్తుకుని చెప్పాం
  • 19 నెలల క్రితం రాష్ట్ర విభజనను 60 శాతం మంది ప్రజలు ఒప్పుకోకపోయినా నిరంకుశంగా విభజించారు
  • లోక్ సభలో విభజన బిల్లును వ్యతిరేకించినందుకు మమ్మల్ని లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు
  • ఆరోజు లైవ్ టీవీ ప్రసారాలను కూడా కత్తిరించిన బ్లాక్ డే
  • రాష్ట్రంలో ఉన్నవాళ్లెవరూ ఆరోజును మర్చిపోలేరు
  • ఆ తర్వాత వాళ్లకున్న బలంతో.. బీజేపీ, చంద్రబాబుల మద్దతుతో బిల్లు ఆమోదం పొంది, రాజ్యసభకు వెళ్లింది.
  • ఆరోజు రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ మధ్య ప్రత్యేక హోదా అన్న పదాన్ని పెట్టారు
  • ఆరోజు పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి రాష్ట్రం విడిపోవడం దురదృష్టకరం.. రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వస్తోంది కాబట్టి, సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయం నాకు తెలుసు. హైదరాబాద్ దూరమైతే 70 శాతం పరిశ్రమలు, 95 శాతం సాఫ్ట్ వేర్ సేవలు అన్నీ దూరం అవుతాయన్నారు. కాబట్టే సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తాం అన్నారు. దాంతో సీమాంధ్రను బాగుపరుస్తాం, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయన్నారు.
  • ఆరోజు అదే పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వాళ్లు.. ఐదేళ్లు కాదు, అలా అయితే పరిశ్రమలు పెట్టడానికే మూడేళ్లు పడుతుంది కాబట్టి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది
  • ఆరోజు రాజ్యసభలో టీడీపీ సభ్యులు కూడా రాష్ట్రాన్ని విభజించడానికి మద్దతు తెలిపి, ఓటు వేశారు.
  • మొదటి ఓటు మేమే వేశామని టీడీపీ ఎంపీలు విక్టరీ సింబల్ చూపించిన రోజులు మనకు గుర్తున్నాయి
  • ఆరోజు అధికారపక్షం, ప్రతిపక్షంలో ఉన్న సభ్యులంతా కలిసి మాట ఇచ్చారు.
  • రాష్ట్రాన్ని విడగొడుతున్నాం గానీ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు
  • పార్లమెంటులో ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి ఒక మాట ఇస్తే.. ఆ మాటను మీరు గౌరవించకపోతే, ఇక సామాన్యులమైన ఏమం ఎటువైపు చూడాలని నిలదీస్తున్నా.
  • మన ఖర్మ ఏమిటంటే.. ప్రత్యేక హోదా అంటే ఏంటో చాలామంది నాయకులకు కూడా తెలియదు
  • దానివల్ల ప్రధానంగా రెండు మేళ్లు జరుగుతాయి
  • ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటులు వస్తాయి. 90 శాతం గ్రాంటు, 10 శాతం మాత్రమే రుణం అవుతుంది.
  • రాష్ట్రానికి ఊరికే డబ్బిస్తారు కాబట్టి రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది.
  • అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే గ్రాంటు కేవలం 30 శాతమే ఉంటుంది.
  • రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తారు. ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ టాక్స్, ఆదాయపన్ను లేకుండా పరిశ్రమలు పెట్టచ్చు
  • అలా అయితే ఉత్సాహవంతులు ముందుకొచ్చి.. పరిశ్రమలు నెలకొల్పుతారు.
  • దాంతో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి
  • వాటితో పాటు.. వాటి వల్ల రాష్ట్రం అంతా బాగుపడే పరిస్థితి వస్తుంది.
  • కానీ ఈవాళ అలాంటి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో పార్టీలు ఏమంటున్నాయి..
  • వీళ్లు చేస్తున్న రాజకీయాలు చూస్తే బాధ అనిపిస్తోంది
  • రాహుల్ గాంధీ మొన్న ఆంధ్రరాష్ట్రానికి వచ్చాడు.. 15 నెలల తర్వాత గుర్తుకొచ్చింది. పార్లమెంటులో ఈ వ్యక్తి ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు
  • ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడతానంటాడు.
  • అగ్గి పెట్టేసి, తర్వాత తానే వచ్చి నీళ్లు పోసి ఆర్పుతానంటాడు
  • పెద్దాళ్లు ఏదో చెబుతారు, సామాన్యులమైన మనం వినాలి
  • బీజేపీని అడుగుతున్నా.. ఆరోజు రాష్ట్రం గురించి మీకు బాగా తెలుసు
  • కాంగ్రెస్ అడ్డంగా విభజిస్తుంటే, వాళ్లు ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఇదే పార్లమెంటు నుంచి.. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది మీరు కాదా?
  • బీజేపీ మేనిఫెస్టోలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని రాసింది.
  • ఇదే బీజేపీ.. ఈరోజు ప్రత్యేక హోదా విషయానికొస్తే ఇవ్వకుండా పోతోంది.
  • బీహార్, ఒడిషా అడుగుతున్నాయని, 14వ ఆర్థికసంఘం అడ్డుపడుతోందని చెబుతున్నారు.
  • ఇదే ఒడిషా, ఇదే బీహార్ .. ఆరోజు మీరు విభజించినప్పుడు గుర్తులేదా అని అడుగుతున్నాను.
  • 14వ ఆర్థిక సంఘం అంటే ఏంటో తెలుసా, అదేం చేస్తుందో మీకు తెలుసా?
  • అసలు ఆ సంఘానికి ప్రత్యేక హోదా గురించి రికమెండ్ చేసే పరిస్థితి ఉందా?
  • అలాంటి అధికారం అసలు 14వ ఆర్థిక సంఘానికి లేనే లేదు.
  • దేశంలో పన్నుల రూపేణా వచ్చిన డబ్బులను ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలోనన్న అంశాన్ని పరిశీలించడమే వాళ్లు చేసే పని
  • అది కాక.. నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాల గురించి మాత్రమే రికమండేషన్స్ చేస్తుంది.
  • కానీ ఇదే కమిషన్ కు.. ప్లాన్ లోటు గురించి గానీ, ప్లాన్ గ్రాంటు గురించి గానీ ఎలాంటి కేటాయింపులు చేసే అధికారం ఉండదు
  • నేషనల్ డెవల్ మెంట్ కౌన్సిల్ కు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చే, ఇవ్వకపోయే అధికారం ఉంటుంది
  • ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారు
  • ప్రత్యేక హోదా ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటని కేంద్రాన్ని, చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా
  • ఈశాన్య రాష్ట్రాలకు మీరిచ్చిన ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుంటారా అని వైవీ సుబ్బారెడ్డి అడిగితే.. కొనసాగిస్తున్నామని పార్లమెంటులో సమాధానం ఇచ్చారు
  • మరి వాళ్లకు ఇచ్చేటప్పుడు.. మనకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా
  • రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు
  • రాష్ట్రం విడిపోయిన తర్వాత మేం పలు సందర్బాల్లో మిమ్మల్ని అడిగాం.
  • ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపుదామని అడిగాం.. ఆయనేమీ స్పందించలేదు.
  • అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి.. కేంద్రాన్ని నిలదీద్దామని అడిగా.. దానికీ స్పందన లేదు
  • హోదా ఇవ్వరని తెలిసినప్పుడు కేంద్రంలో మీ మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారని అడిగాం. అయినా దానికీ స్పందించలేదు
  • మంగళగిరిలో రెండు రోజులు నిరాహార దీక్ష చేశాం
  • ప్రత్యేక హోదా రాదని.. ఇక ఉద్యోగాలు రావన్న ఆవేదనతో మునికోటి అనే వ్యక్తి ఆత్మార్పణ చేశారు
  • 65 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వేలాది మంది ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం.. ఇంతమంది ఆవేదన మీకు అర్థం కావడం లేదా చంద్రబాబూ?
  • ఓటుకు కోట్లు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వీడియో, ఆడియో టేపులున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ గెలుచుకోవాలని చేసిన దిక్కుమాలిన ప్రయత్నంలో.. డబ్బిస్తూ సూట్ కేసుతో సహా పట్టుబడితే.. చంద్రబాబును ఈరోజుకూ ఎందుకు అరెస్టు చేయలేదు?
  • ఈ విషయాన్ని నేను మాత్రమే కాదు.. బిజినెస్ లైన్ అనే జాతీయ పత్రిక స్వయంగా అడిగింది
  • చంద్రబాబు తన స్వార్థం కోసం ఆ విచారణ జరగకుండా చూసుకునేందుకు రాష్ట్రాన్నే పణంగా పెట్టారని బిజినెస్ లైన్ చెప్పింది
  • గోదావరి ఎప్పుడు పొంగినా.. పోలవరం ప్రాజెక్టుతో నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • ఆ నీళ్లతో రాష్ట్రమంతా బాగుపడే అవకాశం ఉంటుంది
  • కానీ చంద్రబాబు లంచాలు, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు.
  • కేంద్రంలో దినేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి ఓ లేఖ రాశారు.
  • పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ వర్క్ తప్ప ఏమీ జరగడం లేదని, పదే పదే దీని గురించి ప్రశ్నిస్తున్నా స్పందించడలేదని, ఎందుకు చేయడం లేదని కేంద్రం చంద్రబాబుకు గడ్డిపెడుతూ లేఖ రాసింది
  • ఎడమ కాలువలో కూడా కాంట్రాక్టర్ పనులు చేయట్లేదని రాశారు
  • చంద్రబాబు ఇదే కాంట్రాక్టరుకు 290 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చారు.
  • పోలవరం ప్రాజెక్టు మీద నువ్వు చూపెడుతున్న శ్రద్ధ ఏంటి.. కాంట్రాక్టరు బాగోలేదని ఈరోజు గుర్తుకొచ్చారా.. అడ్వాన్సు ఇచ్చేటప్పుడు గుర్తురాలేదా?
  • కాంట్రాక్టులు చేసేది రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన సంస్థ కాదా
  • పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో.. మరింత దోపిడీ జరుగుతోంది
  • చంద్రబాబు రాష్ట్రాన్ని పణంగా పెట్టారు. కేవలం తన సొంతూరికి మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చి.. తానే బాగుపడాలని చూస్తున్నాడు
  • చంద్రబాబు మీద, కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి అసెంబ్లీ జరగడానికి  మూడు రోజుల ముందు.. 28వ తేదీ రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నాం
  • ఈ పోరాటం ఇంతటితో ఆగదు.. ఇంకా ముందుకు సాగుతుంది
  • ఇక్కడి నుంచి మనమంతా పార్లమెంటుకు మార్చ్ చేద్దాం. రండి కదులుదాం.. అంతా కలిసి పార్లమెంటు వైపు నడుద్దాం
Share this article :

0 comments: