పెద్ద చదువులు పేదల హక్కు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెద్ద చదువులు పేదల హక్కు: విజయమ్మ

పెద్ద చదువులు పేదల హక్కు: విజయమ్మ

Written By news on Friday, September 7, 2012 | 9/07/2012

 పెద్ద చదువులు... పేదల హక్కుగా భావించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితుల పేరుతో పేద విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎందుకు భారంగా భావిస్తోందో అర్థం కావటం లేదని విజయమ్మ అన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని వర్తింపచేయాలంటూ ఆమె గురువారం ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలాంటి పరిమితులు లేకుండా అర్హులైన పేదలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపచేసినట్లే ప్రభుత్వం కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

పేదలు... చదువులకు పేదలు కారాదనే భావించే వైఎస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రతిభ ఉండి డబ్బులేని విద్యార్థులపై పరిమితుల పేరుతో ఆంక్షలు విధించటం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వం తన జేబులో నుంచి డబ్బులు తీసి ఇవ్వటం లేదని విజయమ్మ మండిపడ్డారు. పన్నులు వేస్తూ ఖజానా నింపుకుంటోన్న ప్రభుత్వం ప్రజల కష్ట సుఖాలను మాత్రం గాలికి వదిలేసిందని తనతో వైఎస్‌ జగన్‌ అన్నారని వైఎస్‌ విజయమ్మ తెలిపారు. పేద విద్యార్థుల బాధను గమనించే వైఎస్ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని ఆమె తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

ప్రతి ఒక్కర్ని ఉన్నత చదువులు చదివించడం ప్రభుత్వం బాధ్యత అని వైఎస్‌ అనేవారని వైఎస్‌ విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్‌ ఉన్నప్పుడు విద్యార్థులు ఎంతో ధైర్యంగా ఉండేవారని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు కూడా వైఎస్ఆర్‌పై ఎంతో నమ్మకంగా ఉండేవని అన్నారు. వైఎస్ఆర్‌ చనిపోయిన తర్వాత విద్యార్థులు టెన్షన్‌తో బతుకుతున్నారని వాపోయారు.

పేద విద్యార్ధులు వేలకువేలు ఫీజులు ఎలా చెల్లిస్తారని వైఎస్ విజయమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగారుస్తోందని మండిపడ్డారు. వైఎస్ లా ఆలోచిస్తే సామాజిక విప్లవం వస్తుందని విజయమ్మ అన్నారు. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుపై వైఎస్ జగన్ దీక్ష చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
Share this article :

0 comments: