నేడు ‘పాదయాత్ర-మై డైరీ’ పుస్తకావిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు ‘పాదయాత్ర-మై డైరీ’ పుస్తకావిష్కరణ

నేడు ‘పాదయాత్ర-మై డైరీ’ పుస్తకావిష్కరణ

Written By news on Friday, September 7, 2012 | 9/07/2012

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ‘ప్రజాప్రస్థానం’ స్మృతులపై రూపొందించిన ‘పాదయాత్ర- మై డైరీ’ పుస్తకాన్ని శుక్రవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. 2003లో ‘ప్రజాప్రస్థానం’ పేరిట మండుటెండలో 58 రోజులపాటు పాదయాత్ర నిర్వహించిన వైఎస్ నాడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు తన అనుభవాలను స్వయంగా డైరీలో రాసుకున్నారు. వైఎస్ మరణించి సెప్టెంబర్ 2 నాటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తాజాగా ఆ వివరాలను ‘పాదయాత్ర - మై డైరీ’ పేరిట పుస్తకంగా రూపొందించారు. ఏపీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్‌వోరా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ నేతలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ తన సందేశాన్ని పంపినట్లు తెలిసింది. కేవీపీ ఆహ్వానం మేరకు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు పుస్తకావిష్కరణలో పాల్గొనేందుకు ఢిల్లీ వె ళ్లారు. ఇందులో పీసీసీ అధ్యక్షుడు బొత్సతోపాటు మంత్రులు వట్టి వసంతకుమార్, రఘువీరా, ఆనం రామనారాయణరెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులున్నారు.
Share this article :

0 comments: