మహాఘట్టం.. ప్రజాప్రస్థానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహాఘట్టం.. ప్రజాప్రస్థానం

మహాఘట్టం.. ప్రజాప్రస్థానం

Written By news on Thursday, October 18, 2012 | 10/18/2012

పేదవాడి ఆర్ద్రత ప్రపంచానికి చెప్పాం..
ఒక నాయకుడిగా నా బాధ్యత నిర్వర్తించా..
పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ అన్న మాటిది 


ప్రజాప్రస్థానం సాగిందిలా...
తొలివారం: 2003 ఏప్రిల్ 9-15 వరకు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 160 కిలోమీటర్లు
రెండోవారం: ఏప్రిల్ 16-22 వరకు మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 159 కిలోమీటర్లు
మూడోవారం: ఏప్రిల్ 23-29 వరకు నిజామాబాద్ జిల్లాలో 181 కిలోమీటర్లు
నాలుగోవారం: ఏప్రిల్ 30-మే 6 వరకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 172 కిలోమీటర్లు
అయిదోవారం: మే 7-13 వరకు ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 167 కిలోమీటర్లు
ఆరోవారం: మే 14-20 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 103 కిలోమీటర్లు
ఏడోవారం: మే 21-27 వరకు తూర్పు గోదావరి జిల్లాలో 97 కిలోమీటర్లు
ఎనిమిదోవారం: మే 28-జూన్ 3 వరకు తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో 157 కిలోమీటర్లు
తొమ్మిదోవారం: జూన్ 4-10 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 166 కిలోమీటర్లు
పదోవారం: జూన్ 11-15 వరకు శ్రీకాకుళం జిల్లాలో 114 కిలోమీటర్లు

రాష్ట్రమంతటా కరువు తాండవిస్తున్న రోజులవి... ఎటు చూసినా ప్రజలు బాధలతో అల్లాడుతున్న కాలమది... ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలన సాగుతున్న దుర్దినాలవి... ప్రజల కన్నీటిని లెక్కచేయకుండా వారి గుండెలపై తుపాకులు ఎక్కుపెడుతున్న దుర్మార్గపు ఘడియలవి... మా బాధలెందుకు పట్టించుకోవని ప్రశ్నించిన మహిళలపై వాటర్ కేనన్లు ప్రయోగించి గుర్రాలతో తొక్కించిన ఘట్టాలవి... ఆర్చే వాళ్లు లేరు... తీర్చే వాళ్లు లేరు... రాష్ట్రప్రజలు నిస్సహాయంగా, నిర్జీవంగా బతుకులీడుస్తున్న రోజుల్లో... నేనున్నానంటూ నడుం బిగించాడా సాహస వీరుడు... ఆయనే డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఒకవైపు నిప్పులు చెరుగుతున్న ఎండ... మరోవైపు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని రోజులు. ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకుని వారికి మంచిరోజులొస్తాయని భరోసా ఇస్తూ ధైర్యం చెప్పడానికి సాహసయాత్రకు నడుంబిగించారు. కరువు కోరల్లో నలుగుతున్న ప్రజానీకం కన్నీటిని తుడవాలని... గుండె చెదిరి ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలన్న లక్ష్యంతో... సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మండుటెండలో సొంత పనిమీద కాస్త దూరం నడవలేని రోజుల్లో జనం బాట పట్టారు. ప్రజల కోసం సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు. అందుకే భారతదేశ చరిత్రలోనే అదొక సాహస ఘట్టంగా చిరస్థాయిగా నిలిచింది. 

2003 ఏప్రిల్ 9: చరిత్రలోనే కీలక ఘట్టం ప్రారంభమైన రోజు. ప్రజా ప్రస్థానం పేరుతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. 40 డిగ్రీలు దాటిన మండటెండను సైతం లెక్కచేయకుండా ఏకబిగిన 68 రోజుల పాటు పాదయాత్ర చేస్తూ జనం గుండెలను తట్టారు. చేవెళ్లలో ప్రారంభించిన వైఎస్ కాలినడక 1475 కిలోమీటర్లు సాగింది. 11 జిల్లాల్లోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జూన్ 15 వ తేదీ వరకు ఏకబిగిన ప్రజల మధ్య కొనసాగింది. మండుటెండలో చేవెళ్ల నుంచి ప్రారంభమైన ప్రజాప్రస్థానం శ్రీకాకుళం జిల్లా సోంపేట చేరేసరికి వరుణుడు కరుణించాడు. మరుసటి రోజు పాదయాత్ర ముగియనుందనగా, సోంపేటలో భారీ వర్షం వైఎస్‌కు స్వాగతం పలికింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన కాలినడక 68 వరోజు సాయంత్రానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకుంది. అశేష జనవాహిని సాక్షిగా ప్రజాప్రస్థానం ముగిసింది.
- న్యూస్‌లైన్, హైదరాబాద్

source:sakshi
Share this article :

0 comments: