అప్పుడు కావూరి, ఇప్పడు నల్లారి: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పుడు కావూరి, ఇప్పడు నల్లారి: అంబటి

అప్పుడు కావూరి, ఇప్పడు నల్లారి: అంబటి

Written By news on Saturday, November 9, 2013 | 11/09/2013

అప్పుడు కావూరి, ఇప్పడు నల్లారి: అంబటివిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
హైదరాబాద్: అప్పుడు కావూరి సాంబశివరావు  మంత్రి పదవి కోసం సమైక్యవాదం వినిపించినట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన సెటిల్మెంట్ కోసం ఈ వాదనను వినిపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం నిజంగా సమైక్యవాది అయితే సమైక్యరాష్ట్రం కోసం ఈ వంద రోజులు ఏం చేశారు? అని ప్రశ్నించారు.  కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, జీవోఎం ఏర్పాటును ఎందుకు అడ్డుకోలేకపోయారు? అని అడిగారు. విభజన డ్రామాలో అన్ని పాత్రలు కాంగ్రెస్ పార్టీయే పోషిస్తుందని విమర్శించారు.

సీఎం కిరణ్ చేత పార్టీ పెట్టించి మళ్లీ కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని ఆశిస్తుందన్నారు. ఈ డ్రామానంతటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తగిన బుద్ధి చెబుతారని అంబటి హెచ్చరించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, కిరణ్ లు విభజన డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. విభజనకు కిరణ్ ఆమోదించినట్లు ఒక పక్క దిగ్విజయ్ చెబుతుంటే, మరో పక్క సీఎం మాత్రం ఇంకా తాను సమైక్యవాదినేనని చెబుతున్నారని విమర్శించారు.

పదవి ముఖ్యం కాదంటున్న సీఎం కిరణ్ జులై 30న ఎందుకు రాజీనామా చేయలేదు? అని  అంబటి ప్రశ్నించారు.  ఆ రోజే సీఎం పదవికి రాజీనామా చేసుంటే  రాష్ట్ర విభజన ప్రకటన వచ్చేదా? అని అడిగారు. వార్ రూమ్ లో పదవి కోసం కన్వీన్స్ అయిన సీఎం బయటకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నల్లారి నాటకంతో ప్రజలు క్షోభిస్తున్నారన్నారు.  కాంగ్రెస్ తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: