తెలుగువారి క్షేమం కోరుకోవడంలో జగనే బెటరు (గ్రేట్ ఆంధ్ర) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగువారి క్షేమం కోరుకోవడంలో జగనే బెటరు (గ్రేట్ ఆంధ్ర)

తెలుగువారి క్షేమం కోరుకోవడంలో జగనే బెటరు (గ్రేట్ ఆంధ్ర)

Written By news on Wednesday, November 6, 2013 | 11/06/2013

రాష్ట్ర విభజన విషయంపై రగులుతున్న రాజకీయంలో జగనే బెటరు అన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో చిన్న వాడైనా, రాష్ట్రం లో నెలకొన్న సమస్యలపై చంద్రబాబు, కిరణ్‌ వంటి వారితో పోల్చుకుంటే చాలా తక్కువ అవగాహన ఉన్న వాడైనా సరే, తెలుగువారి క్షేమం కోరుకోవడంలో జగనే చాలా క్లియర్‌, బెటర్‌ నిర్ణయం తీసుకున్నాడు అన్న భావం రాజకీయ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది.
జిఓఎం కు లేఖ విషయంలో జగన్‌ తీసుకున్న తాజా నిర్ణయం తో పాటు, రాష్ట్రాన్ని విభజిస్తూ సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకటించినప్పడు మూకుమ్మడి రాజీనామాలు, తర్వాత చేసిన ఆమరణ దీక్షలు, మీడియా సమావేశాల్లో తెలిపిన అభిప్రాయాలు ఇలా అన్నింటిలో కూడా డొంక తిరుగుడు కాకుండా సూటిగా తన అభిప్రాయాలు, తమ వాదనను ముక్కుసూటిగా చెప్పాడు అయినా ఇంకా తెలుగుదేశం పార్టీ, దాని 'పచ్చ'పాత పత్రికలు జగన్‌ వెనుక రహస్య ఎజెండా వుందని, సమైక్య వాది కాదని ప్రచారాలు సాగిస్తూనే వున్నాయి. తెలంగాణ ప్రకటించినప్పుడు డైరెక్టుగా తాము విభజనకు వ్యతిరేకం అంటూ మూకుమ్మడి రాజీనామాలు చేసి తమది సమైక్యం అంటూ నిక్కచ్చిగా తన స్టాండును చెప్పాడు జగన్‌. తూచ్‌..కాంగ్రెస్‌ ముందుగా హింట్‌ ఇస్తే, రాజీనామాలు చేసారంటూ విమర్శలు కురిపించారు. తరువాత మళ్లీ వాదన మార్చి జగన్‌ సమైక్యవాది కాదు, కొన్ని జిల్లాలకే పరిమితం అంటూ కొత్తవాదన ప్రారంభించారు. అదీ చాలక, అతగాడు వెళ్లి కాంగ్రెస్‌ కలుస్తాడంటూ గోల పెట్టడం ప్రారంభించారు. జగన్‌ మాత్రం పదేపదే నేను సమైక్యవాదిని అంటూ చెబుతూనే వస్తున్నాడు. అదే మాట జిఓఎమ్‌ కు చెప్పాడు, రాష్ట్రపతికి చెప్పాడు. 
కానీ ఈ 'పచ్చ'పాత పత్రికలకు మాత్రం చంద్రబాబు గోడమీది పిల్లి వాటం కనిపించడం లేదు. చంద్రబాబు లేఖలోని చిత్రమైన అంశాలు కనిపించడం లేదు. నిజానికి పరోక్షంగా చంద్రబాబు తనది సమైక్యవాదం అని నిరూపించుకుంటున్నాడు. మొదట తనది  తెలంగాణ వాదమే అన్నాడు. కానీ ప్రధానికి రాసిన లేఖలో అసెంబ్లీ తీర్మానం, అన్ని వర్గాలతో చర్చలు వంటి సాధ్యంకాని విషయాలు ప్రస్తావంచి, తెలంగాణకు తాను మోకాలు అడ్డినట్లే అని స్పష్టం చేసాడు.  జగన్‌ మాత్రం తను తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో పార్టీ పూర్తిగా పోతుందని తెలిసి కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న బలమైన కోరికతో రాజకీయ ప్రయోజనాన్ని కూడా వదులుకుని గోడమిద పిల్లిలా కాకుండా సూటిగా తన స్టాండ్‌ చెప్పేసాడు. ఆ పాటి ధైర్యం తెలుగుదేశం చేయలేకపోతోంది. 
అంతెందుకు ఇప్పుడు జిఓఎం, అఖిల పక్షం సమావేశం వంటి విషయాల్లో చంద్రబాబు, కాంగ్రెస్‌ వంటి పార్టీలు చివరి వరకు తెగ మథనం చేసాయంటే దానర్థం ఆ రెండు పార్టీలలో ఇంకా రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి ఖచ్చితమైన అభిప్రాయం లేనట్టే కదా... కాని జగన్‌ తడుముకోకుండా నిర్ణయం ప్రకటించేసాడు. మంత్రుల బృందం ఏర్పాటు చేసిందే విభజన కోసం, తాము కోరుకుంటున్నది సమైక్య రాష్ట్రం ఉండాలని అలాంటప్పుడు దానికి లేఖ రాయాల్సిన అవసరం లేదన్నారు. విభజన అన్న దానికే తాము వ్యతిరేకమన్నారు జగన్‌. అంతే కాదు అఖిల పక్ష సమావేశం విషయంలో అదే క్లియర్‌ స్టాండ్‌ తీసుకున్నాడు, ప్రధానికి రాసిన లేఖలో, రాష్ట్రపతికి నివేదించిన వినతి పత్రంలో కూడా ఒకటే మాట రాష్ట్రాన్ని విడగొట్టవద్దన్నదే తమ స్టాండ్‌ అని చెప్పేసాడు. కాని చంద్రబాబు ఇప్పటికి గోడమీద పిల్లిలాలాగానే ఉన్నాడంటే అందరి కంటే జగనే బెటర్‌ అన్నట్టు కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎప్పుడు మాట్లాడినా, ఎవరు ప్రశ్నలడిగినా టిడిపి అధినేత తడుము కోకుండా చెప్పే జవాబు తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లు, తనది రెండు కళ్ల సిద్దాంతం అని. కాని దాని వెనుక అసలు రహస్యం తెలిసిన వారికి మాత్రం క్లియర్‌ గా అర్థం అయ్యేది ఏంటంటే ఆయన చేసే పని తెలంగాణ ఏర్పాటు కాకుండా అడ్డుకోవడమే అని. కాని ఈ విషయం డైరెక్టుగా చెప్పకుండా తన చేతలు, వ్యవహారంతో అదే పని చాపకింద నీరులా చేసుకుపోతున్నాడు. అంతెందుకు దీనికి బలమైన ఉదహరణ తెలంగాణ ఇస్తానంటే అప్పట్లో బిజేపిని అడ్డుకున్నది నేనే అని చంద్రబాబే చెప్పడం. అంటే ఆయనకు తెలంగాణ ఏర్పడడం అస్సలు ఇష్టం లేదన్న మాట. ఇది తాజాగా ఆయన చేస్తున్న పనులు, వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కూడా చంద్రబాబు తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకుంటున్నాడన్న విషయం క్లియర్‌ గా అర్థం అవుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఆయన మంత్రుల బృందానికి లేఖ ను ఇవ్వనని దానిని బహిష్క రించారు, అఖిల పక్షం సమావేశానికి వెల్లనని చెప్పేసారు. అంటే ఇవి రెండు కూడా తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసినవన్న విషయం అందరికి తెలిసిందే కదా. అంటే జిఓఎం కు లేఖ ఇచ్చినా తెలంగాణ ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై ఇవ్వాలి. అఖిల పక్షం సమావేశానికి హాజరయితే కూడా చెప్పాల్సింది తెలంగాణ ఏర్పాటు విదానం చెప్పడానికి అందుకే ఆయన ఆ రెండింటిని బహిష్కరించారు. అంటే చాలా క్లియర్‌ గా చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకి అన్నది అర్థమవుతోంది .
సరే ఈ రెండింటిని బహిష్కరించి, తన పార్టీకి చెందిన రెండు ప్రాంతాల నేతలను ఒప్పించేందుకు ప్రధానికి లేఖ రాసారు. ఇక అది ఎలా రాసారో చూద్దాం.... విభజన అనేది రాష్ట్రంలోని మొత్తం జనాల ఆమోదం పొందాలి, ఇదెలా తెలుసుకోవాలంటే కూడా మార్గం చెప్పాడు తెలంగాణ, సీమాంద్రలకు చెందిన అన్ని జేఏసిలను, విద్యార్థి, రైతు, ఉద్యోగ సంఘాలను పిలిచి ఒకే చోట సమావేశ పరిచి అందరి ఆమోదం విభజనకు అనుకూలమైతే విభజించాలి అన్నాడు. ఇరు ప్రాంతాల్లో జాయింట్‌ ఆక్షన్‌ కమిటీలు ఎందుకు ఏర్పడ్డాయి, అంటే ఎవరైనా సరే చెప్పే జవాబేంటి, సమైక్యం కోసం ఓ చోట, ప్రత్యేకం కోసం మరోచోట అని చెబుతారు. ఇక వారందరిని కూర్చో బెడితే విభజనకు అనుకూలంగా అభిమతం ఎలా వస్తుంది అన్నది చిన్నపిల్లోడికైనా తెలిసిన విషయం.
ఇక అన్ని పార్టీలకు చెందిన ఇరుప్రాంతాల నాయకులు, ప్రజా ప్రతినిధులను కూడా కూర్చోబెట్టి ఏకాభిప్రాయం తీసుకోవాలట. నవ్విపోతే నాకేటి సిగ్గు అన్నట్టు కాకపోతే తన పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలతో కలిసి ఎన్నో రోజులుగా చర్చలు జరిపినా కూడా ఏకాభిప్రాయం రాలేదు. అలాంటిది అన్ని పార్టీల ఇరు ప్రాంతాల నేతల్లో ఏకాభిప్రాయం ఎలా వస్తుంది. పైగా అసెంబ్లీ నుంచి ప్రతిపాదన రావాలట. అంటే ఇది సాధ్యమా? దీన్ని బట్టి చూస్తే , చంద్రబాబు చెప్ప దల్చుకున్నదేమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయవద్దనే కదా.. కాని డైరెక్టుగా చెప్పకుండా ఇలా మెలికలు పెడుతున్నాడన్న మాట. దీన్ని బట్టి చూస్తే తెలంగాణపై కుండ బద్దలు కొట్టిన జగనే బెటరు కదా.

http://telugu.greatandhra.com/politics/gossip/jagan-is-better-47900.html
Share this article :

0 comments: