ప్రకృతి కక్ష... ప్రభుత్వ ఉపేక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రకృతి కక్ష... ప్రభుత్వ ఉపేక్ష

ప్రకృతి కక్ష... ప్రభుత్వ ఉపేక్ష

Written By news on Thursday, November 7, 2013 | 11/07/2013

ప్రకృతి కక్ష... ప్రభుత్వ ఉపేక్ష
sakshi: 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల సమయంలో కొన్ని జిల్లాలలో కొందరికి కంటితుడువుగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడం మినహా, తాము వేసిన అంచనాల ప్రకారమైనా రైతులకు నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు.
 
 రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పం టలు సర్వం నాశనమైపోయా యి. వరి, పత్తి, మిరప, అరటి ఒకటేమిటి అన్ని పంటలూ వర్ష బీభత్సానికి నేలకొరిగాయి. వర దల పాలైనాయి. వారం రోజుల కుండపోత వర్షాలతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆరు లక్షల హెక్టార్లకుపైగా పంట నీటి మునిగింది. తెలంగాణ ప్రాం తం లోనూ పంటల మీద దాని ప్రభావం ఉంది. పత్తితో పాటు వరి, మొక్కజొన్న, చెరకు, కంది పంటలు నష్టానికి గురయ్యాయి. మంచి వర్షాలతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అసాధారణ దిగుబడులు ఇవ్వగల దని ఎదురు చూస్తున్న తెలుగు రైతు ఆశలు మొత్తంగా అడియాసలయ్యాయి. సాధారణంగా రాష్ట్ర ఆహార ఉత్ప త్తులు సాలీనా రెండు సీజన్లలో 1.90 నుంచి 2 లక్షల మెట్రి క్ టన్నుల వరకు ఉంటాయి. గత ఏడాది ఈ ఉత్పత్తులు 1.98 మెట్రిక్ టన్నులు. కోస్తాలో శ్రీకాకుళం నుంచి నెల్లూ రు జిల్లా వరకు అన్నిరకాల పంటలు విపరీతమైన నష్టానికి లోనయ్యాయి. రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదు కుంటుందని ప్రకటనలు వచ్చినా ఇప్పటి వరకు ఏమీ జర గలేదు. బీమా పరిష్కారాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్పు కొస్తున్నా ఆ మాటలను అన్నదాతలు నమ్మే స్థితి లేదు.
 
 రైతు గుండె చెరువు
 సర్వం కోల్పోయిన రైతులు తీవ్ర నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక ఉదాహరణ: కృష్ణాజిల్లా క్రోసూరు మండలం నుంచి 36 ఏళ్ల పత్తి రైతు తలారి పెద్దినారా యణ విషం తాగి మరణించాడు. ఈ రైతు సీజన్‌లో పడిన మంచి వర్షాలతో తన పత్తి పంట మీద అపారమైన నమ్మ కం పెట్టుకున్నాడు. తన 4 ఎకరాల కౌలు భూమిలో పం డిన తెల్ల బంగారంతో వెతలు తీరగలవనుకున్న తరుణం లో అకాల వర్షాలు పంటను ముంచాయి. మాచర్ల మం డలం, కల్వగుంట రైతు ఉడుముల సీతారామిరెడ్డి తన 6 ఎకరాల కౌలు భూమిలో ఏపుకి వచ్చిన పత్తి, మిరప పం టలు పూర్తిగా నీట మునిగిపోగా నిస్సహాయ స్థితిలో విషం తాగి, ప్రాణం వదిలాడు. నల్లగొండ, మహబూబ్‌నగర్, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఆత్మహత్యల ఘోష విన బడింది.
 
తనకున్న పొలాన్నంతా అమ్ముకుని పత్తి సాగులో పెట్టిన నల్లగొండ వాసి మల్లేష్ అనే రైతుదీ ఇలాంటి కథే.  మల్లేష్‌లు, పెద్ది నారాయణలు, సీతారామిరెడ్డిలు పదుల సంఖ్యలోనే ఉండవచ్చు. సర్వం కోల్పోయి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినా, పంటి బిగువున బతుకీడు స్తూ, ప్రత్యామ్నాయ చర్యలైనా ఆదుకుంటాయేమోనని ఎదురు చూస్తున్నవారు వేలల్లో ఉన్నారు. కరీంనగర్ జిల్లా, లక్ష్మీపురం గ్రామవాసి ముక్కిన కేసవరెడ్డి, తూర్పు గోదా వరి జిల్లా పాటిచెరువు రైతు ఒకరు, ప్రకాశం జిల్లా వాసి షేక్ మౌలాలి, మహబూబ్‌నగర్ వాసులు సత్యనారా యణగౌడ్, ర్యాపని మల్లయ్య, నల్లగొండ జిల్లా వాసులు రెడ్డిమాను లెవన్, అవిలి మల్లయ్య, వరంగల్ జిల్లా మహిళా రైతు ఉప్పలమ్మ, పశ్చిమగోదావరి జిల్లా వాసి బల్లెం సుబ్బారావు ఇటువంటి వెతలతోనే ఇటీవల తను వులు చాలించారు. అవే వెతలు అవే అప్పుల రక్కసి కోర లను ఏంచేసి తప్పించుకోవాలో తెలియక దీపావళి రోజున కూడా ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు.
 
 కళ్లుండీ చూడలేని సర్కార్
 2009లో రాజశేఖరరెడ్డి మరణం తరువాత, రాష్ట్ర ప్రభు త్వం ప్రకృతి విపత్తుల సమయంలో కొన్ని జిల్లాలలో కొందరికి కంటితుడువుగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడం మినహా, తాము వేసిన అంచనాల ప్రకారమైనా రైతులకు నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. వివిధ ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీల బకాయిలు జిల్లాల వారీగా గణాంకాలు చూస్తే ఎందుకిలా చేస్తున్నారో తల బద్దలు కొట్టుకున్నా అర్థమవదు. విజయనగరం జిల్లాలో చెల్లించవలసిన 92.86 కోట్లు అతి తక్కువగాను అనంతపురంలో చెల్లించవలసిన 31,708.04 లక్షలు అత్యంత అధికంగాను, మొత్తం 69,722.40 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బకాయిలు చూస్తుంటే రైతులు ఎంత మోసానికి గురౌతున్నారో అర్థమవుతుంది.
 
2010, 2011 సంవత్సరాల కరువు సంబంధిత నష్టపరిహారాలను ఇంత వరకు చెల్లించలేదు. కిందటి ఏడాది నీలం తుపాను తాకిడికి సుమారు రూ.1,600 కోట్ల నష్ట జరిగినట్లు సర్కా రు అంచనా వేసినా అందులో రైతులకు చెల్లించవలసిందే ఎక్కువ ఉందన్న సంగతి నిజం. నాలుగేళ్లుగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపుల చరిత్ర ఇంత ఘనంగా ఉన్నా, ముఖ్య మంత్రి తాజాగా నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌పుట్ సబ్సి డీ అందజేస్తామని చెప్పడం రైతులను పరిహసించడాని కేనా? తీర ప్రాంతాల్లోని తుపాను పీడిత వ్యవసాయ క్షేత్రా లను దర్శించిన మెగా నాయకులు ఇన్‌పుట్స్ సడ్సిడీని హెక్టారుకు పదివేలకు తగ్గకుండా రైతులకు చెల్లించేటట్టు చూస్తామని, రాష్ట్రానికి అత్యధికంగా సాయం అందించేం దుకు కేంద్ర ప్రభుత్వాన్ని తామే స్వయంగా అర్థిస్తామని చెప్పడం ఇంకా వింత. జన్మలో ఇతరులకు సాయం చేసే ఆలోచన లేని ఇటువంటి నాయకులు అన్నదాతలను మభ్యపెడుతున్నారనే చెప్పుకోవాలి. సర్వం కోల్పోయిన రైతు టీవీ చానెళ్లలో వచ్చిన వాగ్దానాలను నమ్ముతాడని అనుకుంటే పొరపాటు. కారణాలు ఏవైనా వ్యాపారులతో పాటు ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తుంటే బక్క రైతుకు దిక్కెవరు?
 
 వినియోగదారుడికీ బాధ్యత
 ఉరుముల్లేని పిడుగుల్లా తాకుతున్న ధరాఘాతాలతో విని యోగదారులు భయభ్రాంతులవుతున్న సమయంలో దేశంలో వ్యవసాయం ఎలా సాగుతుందో ఆ భగవంతునికి కూడా అంతుబట్టేటట్టు లేదు. ఇక్కడ సామాన్య ప్రజలు, అంటే వినియోగదారులైన మనందరం విజ్ఞత ప్రదర్శిం చాలి. కూరగాయలు, ఉల్లిగడ్డల ధర రూ.50 నుంచి రూ.100 వరకు చెలరేగినా మారు మాట్లాడకుండా కొను గోలు చేస్తున్నాం. ఆ ధరల్లో సింహభాగం న్యాయంగా ఉత్పత్తిదారుడైన రైతుకు చెందాలి. కానీ 10 శాతం కూడా చెందడం లేదు. ఈ పరిణామం గురించి అతి తక్కువ మంది ప్రశ్నిస్తున్నారు, తాము చెల్లించే విలువలో ఏ మాత్రం రైతుకు చెందుతున్నదనే అవగాహన వినియోగ దారునికి లేదు. రాజకీయ నాయకులు తాము వినియోగ దారుల ప్రయోజనాల పరిరక్షణ పేరిట అటు వినియోగదా రుడినీ ఇటు రైతునీ కూడా మోసగిస్తున్నారు. కష్టంగానో నష్టంగానో ధరాఘాతాన్ని భరిస్తున్న వినియోగదారుడు, ఆ విలువలో సింహభాగం రైతుకు చెందేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తాడు. అన్నదాతలు తమ కుటుంబాలతో సహా రక్తమాంసాలను వెచ్చిస్తుంటే, వ్యాపారులు, దళారులు ఫోన్ల ముందు కూర్చుని ఆ ప్రతి ఫలాన్ని వారికి చెందకుండా చేస్తుంటే మన వ్యవస్థ తమాషా చూడటం ఈ నాటిది కాదు.
 
 ఏ హక్కూలేని రైతాంగం
 ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రభుత్వం దిగి వచ్చి, చర్చలు జరుపుతుంది. విద్యార్థులు సమస్యల మీద నడుం బిగిస్తే బుజ్జగిస్తుంది. అదే రైతుల విషయంలో మధ్యవర్తులు, ప్రజా సంఘాలు లేదా సాంఘిక కార్యకర్తలు మాత్రమే మాట్లాడతారు. వారికై వారుగా నేరుగా ప్రభుత్వంతో సంప్రదించే పరిస్థితులే లేవు. మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా కూడా అన్యాయాలను ప్రశ్నించలేని బడుగు రైతులే 90 శాతం పైగా ఉన్నారు. రైతులు తాము పండిం చిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందే అవకాశం, హక్కు స్వరాజ్యం వచ్చి 66 ఏళ్లు దాటినా ఇప్పటికీ లేదు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా దక్కకుండా చేయగల దళారీ వ్యవస్థ ఈ దేశంలో మాత్రమే ఉండటం రైతుకు పెద్ద శాపం.

 అక్షరానికి చేరువ కావాలి

 ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా రైతు సమస్యలకు పరి ష్కారాలు కనుగొనలేకపోవడానికి కారణాలు ఈ వ్యవస్థ లోనే ఉన్నాయి. రైతుకు వాటిల్లుతున్న నష్టాల మీద, అన్యా యాల మీద అనేక వర్గాల ప్రజలు, విద్యావంతులకే అవ గాహన కొరవడిన ప్రస్తుత సమయంలో సామాన్య ప్రజా నీకానికి ఈ అంశం మీద సామాజిక స్పృహ కలిగి ఉండ టం అసాధ్యం. అందుకే అన్నదాతలు విద్యావంతులు కావాలి.
 
తమకు జరుగుతున్న అన్యాయాన్ని సంఘటి తంగా తామే ప్రశ్నించనంత కాలం తమ హక్కులను సాధించుకోవడం అంత సులభం కాదు. సమాజానికి కూడా తామే ఒక ఉత్ప్రేరకం కావాలంటే తమను తాము ఉత్తేజపరచుకోవాలి. అప్పడే సమాజం స్పందిస్తుంది. చర్చ ఉద్భవిస్తుంది. తద్వారా సంస్కరణలూ పరిష్కారా లూ వెలువడతాయి, ఆత్మహత్యలు ఆగిపోగలవు. అన్నిం టికన్నా ముఖ్యంగా వ్యవసాయం రాజశేఖరరెడ్డి కోరుకు న్నట్లుగా ఒక పండుగవుతుంది. అటువంటి పండుగ రోజు లు మన రైతుకు త్వరలోనే రావాలని కోరుకుందాం.
 -డా॥బలిజేపల్లి శరత్‌బాబు,
 ప్రధాన శాస్త్రవేత్త, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, హైదరాబాద్
Share this article :

0 comments: