హత్యా రాజకీయాలొద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హత్యా రాజకీయాలొద్దు

హత్యా రాజకీయాలొద్దు

Written By news on Friday, August 15, 2014 | 8/15/2014

హత్యా రాజకీయాలొద్దు
కంచికచర్ల : నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే రాజకీయ నాయకులు హత్యలను ప్రోత్సహించవద్దని, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని వైఎస్సార్‌సీపీ  విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు కోనేరు రాజేంద్రప్రసాద్ సూచించారు. మండలంలోని గొట్టుముక్కలలో ఆదివారం అర్థరాత్రి హత్యకు గురయిన ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను గురువారం కలుసుకుని ప్రగాడ సానుభూతి తెలిపారు. హత్య జరిగిన తీరుపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు.

నిద్రపోతున్న కృష్ణారావును లేపి రాడ్లతో, కర్రలతో కొట్టి రెండు పెడరెక్కలు విరిచి లాక్కుంటూ కాళ్లతో తన్నుకుంటూ బయటకు తీసుకువెళ్లి చంపి రోడ్డుపై పడేశారని కృష్ణారావు భార్య ముత్తమ్మ, కుమార్తె వాసిరెడ్డి నాగమణి  చెప్పారు.  కుంటుంబానికి పెద్దదిక్కు పోయిందని కోనేరు ముందు బోరున విలపించారు. తమను దిక్కులేని వారిని చేసిన  హత్యను ప్రోత్సహించిన వారిని శిక్షించాలని అన్నారు.

కోనేరు మాట్లాడుతూ  ఈ విషయాలన్నీ జిల్లా ఎస్పీ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లి హత్యకు సహకరించిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు. పచ్చని గ్రామాల్లో జీవించే వారిపై రాజకీయాల కోసం దాడులు చేసి హత్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గ్రామాల్లో అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధికోసం పాటుపడాలని, కక్షలు పెంచుకుంటూపోతే ప్రజలు గ్రామాల్లో ఎవరూ మిగలరని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నంత మాత్రాన హత్యలు చేస్తే చట్టం ఊరుకోదని తెలిపారు.

అనంతరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై రాళ్లు రువ్వి కిటికీ అద్దాలను పగులకొట్టారని, బయటకు వస్తే చంపుతామని  నానా దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని కోనేరుకు తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమయం నుంచి టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అయినా ఊరుకుంటున్నామని దీంతో పోలీసు వర్గాలన్నీ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కోనేరుతో పార్టీ నేతలు వాపోయారు.

కోవెలమూడి వెంకటనారాయణ, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, జగ్గయ్యపేట మున్సిపల్‌చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు షేక్ షహనాజ్‌బేగం, మహ్మద్ గౌస్, గుదే రంగారావు, అక్కారావు, తాటుకూరి గంగాధరరావు, కోటేరు సూర్యనారాయణరెడ్డి, ములకలపల్లి శేషగిరిరావు, వాసిరెడ్డి విజయకుమార్, జొన్నలగడ్డ సుబ్బారావు, ఆలోకం శ్రీనివాసరావు, గుదే సాంబశివరావు, తాటుకూరి అమ్మారావు, బండి వెంకట్రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: