అధికార పక్షం తీరు ఆత్మస్తుతి, పరనింద : వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికార పక్షం తీరు ఆత్మస్తుతి, పరనింద : వైఎస్ జగన్

అధికార పక్షం తీరు ఆత్మస్తుతి, పరనింద : వైఎస్ జగన్

Written By news on Tuesday, August 26, 2014 | 8/26/2014

అధికార పక్షం తీరు ఆత్మస్తుతి, పరనింద : వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన రెడ్డివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: శాసనసభలో అధికార పక్షం తీరు ఆత్మస్తుతి, పరనింద మాదిరిగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. శాసనసభ వాయిదా వేసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసనసభ స్పీకర్ తీరును  ఆయన  తప్పు పట్టారు.  ప్రతిపక్ష నేత ప్రసంగిస్తుండగా 17 సార్లు మైకు కట్ చేశారని తెలిపారు. దేశ, రాష్ట్ర  చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరిగి ఉండదన్నారు. రాష్ట్రం మొత్తం తలదించుకునేలా ఉందని చెప్పారు. సభ టీవీ ప్రసారాలు కూడా అధికార పక్షం సభ్యులు మాట్లాడుతున్న చూపడానికే పరిమితమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి శాసనసభను నడుపుతున్నారన్నారు.

 విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడిన మాటలు సంక్షిప్తంగా..
ఇంత అన్యాయంగా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడూ జరుగలేదు. ప్రతిపక్ష నేతగా నేను వాకౌట్ చేయబోతున్నాను అని చెప్పినా మైకు ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని పరిస్థితి ఎప్పుడూలేదు. ఇంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయనేది తానూ చూశాను. ఇంత దారుణంగా ఎప్పుడూ జరుగలేదు. చాలా దారుణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
 ప్రతిపక్ష నేత మాట్లాడే సమయంలో మైక్ కట్ చేస్తారు. 11.08 నిమిషాలకు మాట్లాడటం మొదలు పెడితే 1.40 నిమిషాలకు మైక్ కట్ చేశారు. చంద్రబాబు హామీలు, వారి బడ్జెట్ కేటాయింపులు మాత్రమే మాట్లాడాను. ఇతర ఏ అంశాలు మాట్లాడలేదు. అయినా నా ప్రసంగం మధ్యలో 17 సార్లు మైక్ కట్ చేశారు. నా ప్రసంగానికి అంతరాయం కలిగించారు.  రెండు నిమిషాలు మాట్లాడితే మైక్ కట్. నాలుగు నిమిషాలు మాట్లాడితే మైక్ కట్... అన్యాయంగా మైక్ కట్ చేశారు. నా ప్రసంగానికి గంటా 6 నిమిషాలపాటు  అంతరాయం కల్పించి,  21 నిమిషాలు మాత్రమే అని సర్కారు చెబుతోంది. ఇది మంచి సంప్రదాయం కాదు.

శాసనసభలో అధికార పక్షం, ఒక ప్రతిపక్ష పార్టీ మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్షంగా మా పార్టీ ఒక్కటే ఉంది.ప్రతిపక్షం గొంతు వినాలని ప్రజలు అనుకుంటారు.  మేం మాట్లాడటానికి గంటన్నర సమయం మాత్రమే కేటాయించారు. ఇది చాలు అని అంటున్నారు. గంటన్నర సమయం సరిపోతుందా? ప్రసంగం ముగించడానికి 30 నిమిషాలు సమయం ఇవ్వమంటే ఇవ్వలేదు. ప్రతిపక్షం మాట్లాడకూడదు అంటున్నారు. అధికార పక్షం సభ్యులకు మైకులు ఇస్తారు. మేం ఏదైనా ప్రశ్న అడిగితే, మంత్రులు ఏం చేస్తారో చెప్పరు.  వైఎస్ రాజశేఖర రెడ్డిని తిడతా ఉంటారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రా? అర్ధం కాని పరిస్థితి.

అసెంబ్లీ  టీవీ హక్కులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చారు. అసెంబ్లీ టీవీ కూడా అధికార పార్టీ సభ్యుల వైపుకు వెళ్లిపోతుంది. మేం ఎందుకు నిరసన తెలుపుతున్నామో టీవీలో కనిపించందు. ప్రతిపక్షం మాట వినిపించకూడదు. ఏ ప్రశ్న వేసినా ఇచ్చే సమాదానంలో రాజశేఖర రెడ్డిని తిడతారు. క్లారిఫికేషన్ కోసం మైకు అడిగితే ఇవ్వరు.  వారు మాట్లాడే అంశాలనే ఎక్కువగా టీవీలలో చూపుతారు. మేం నిరసన తెలిపేది కూడా టీవీలో చూపరు. వారు రాజశేఖర రెడ్డిని తిట్టేటప్పుడు మాత్రం టీవీలో చూపుతారు. చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే రాబోయే తరానికి సమాదానం చెప్పలేం. శాసనసభ్యులను సస్పెండ్ చేశారు. వారు ఎందుకు నిరసన తెలుపుతున్నారు. వారు మాట్లాడటానికి అవకాశం ఇద్దాం అని అనుకోరు. మేం 67 మంది శాసనసభ్యులు ఉన్నాం.  40 శాతం సమయం మాకు కేటాయించాలి.

ఇదే మాదిరిగా కొనసాగితే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వెనుకడుగు వేయం. శాసనసభ్యుల సస్పెన్షన్ ను రద్దు చేయాలి. ప్రతిపక్షం గొంతు వినాలని ప్రజలు చూస్తుంటారు. వారికి మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వాలి. అలా అవకాశం ఇవ్వకపోతే ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారు. నిజమైన ప్రతిపక్షం ప్రజలు.  ప్రజల గొంతుతో మేం మాట్లాడతాం. మేం మాట్లాడటానికి మొదట రెండున్న గంటలు సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత  గంటన్నర అన్నారు. స్పీకర్ ఓపికతో శాసనసభను నడపాలి. మా గొంతు వినడానికి ఓపికలేకపోతే  ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవలసి వస్తుంది.
Share this article :

0 comments: