ట్యూషన్ చెబుతున్నా నేర్చుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ట్యూషన్ చెబుతున్నా నేర్చుకోండి

ట్యూషన్ చెబుతున్నా నేర్చుకోండి

Written By news on Monday, August 25, 2014 | 8/25/2014

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది
హైదరాబాద్ : గడిచిన పదేళ్లలో ఏ లెక్క ప్రకారం చూసినా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నా.. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం గవర్నర్ ప్రసంగం నుంచి బడ్జెట్ వరకు ప్రతిచోటా ఆడిపోసుకుంటోందని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్ మీద అసెంబ్లీలో ప్రారంభమైన చర్చలో ఆయన సోమవారం మాట్లాడారు. ఆ పదేళ్లలో చాలా అన్యాయం జరిగిపోయిందని, అంతకుముందు తాము అద్భుతంగా పాలించామని చెబుతున్నారన్నారు. ఆయన ప్రసంగంలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి...

* గత పదేళ్లలో విపరీతమైన అవినీతి, పాలనాలోపం, అక్రమాలు, అభివృద్ధి లేమి ఉన్నాయంటూ బడ్జెట్ మొదటి పేజీలోనే ఆర్థికమంత్రి స్వీపింగ్ రిమార్క్స్ చేశారు.
* గవర్నర్ ఉపన్యాసంలో కూడా ఇంచుమించు ఇలాగే చెప్పారు. ఆ తర్వాత శ్వేతపత్రాలంటూ రకరకాల ఎల్లో పేపర్లు విడుదల చేస్తూ, దాంట్లోనూ ఇదే చెప్పారు.
* చంద్రబాబు ప్రభుత్వం 20 ఏళ్ల కిందకు వెళ్లి అక్కడ తాము పరిపాలన బాగా చేశామని, ఆ తర్వాత అంతా సర్వనాశనమైపోయిందని ఎందుకు అంతలా చెప్పుకొస్తున్నారంటే.. తామిచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితిలోనే గత ప్రభుత్వాల మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నం అని అర్థమవుతోంది. ఇక్కడో సామెత గుర్తుకొస్తోంది. 'ఆడలేక మద్దెల ఓడు' అన్నట్లుంది. అంతా ఆత్మస్తుతి.. పరనిందలా సాగుతోంది.
* ఈ సందర్భంలో మీ నుంచి మేం నేర్చుకోనవసరం లేదని టీడీపీ సభ్యులు అనడంతో 'ట్యూషన్ చెబుతున్నానయ్యా.. నేర్చుకోండి' అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు.
*  ఏ పదేళ్ల గురించి చంద్రబాబు, వారి పార్టీ చెబుతోందో.. ఆ పదేళ్లలో లెక్కలు చూస్తే ఆ కాలంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ జరగలేదని తెలుస్తుంది.
* చంద్రబాఉ కన్నా ముందు పదేళ్లలో గ్రోత్ రేట్ చూసుకుంటే 1984-94 మధ్యలో వ్యవసాయ వృద్ధి 2.38 శాతం, పారిశ్రామిక వృద్ధి 8.26 శాతం, సేవల్లో వృద్ధి 7.30 శాతం. సగటు వృద్ధిరేటు 5.38 శాతం
*  1994-2004 మధ్యలో అంటే, చంద్రబాబు పాలనా కాలంలో వ్యవసాయ వృద్ధి 3.73 శాతానికి పెరిగింది. పారిశ్రామిక వృద్ధి 6.51 శాతానికి పడిపోయింది. సేవల్లో వృద్ధి 7.09 శాతం అయ్యింది. సగటు వృద్ధిరేటు 5.72 శాతం.
* రాజశేఖరరెడ్డి పాలనలో 2004-2009 మధ్య వ్యవసాయంలో వృద్ధి 6.10 శాతం అయ్యింది. పారిశ్రామిక వృద్ధి 10.90 శాతం. సేవల్లో వృద్ధి 10.61 శాతంగా నమోదైంది. సగటున జీఎస్ డీపీ 9.60 శాతంగా నమోదైంది. చంద్రబాబు కన్నా ముందు 53 మార్కులు, చంద్రబాబుకు 57 మార్కులు వస్తే, రాజశేఖరరెడ్డికి 96 మార్కులు వచ్చాయన్నమాట.
*  2009-14 మధ్య వ్యవసాయంలో 3.94 శాతానికి తగ్గింది. పారిశ్రామిక వృద్ధి 5.05 శాతానికి తగ్గింది. సేవల రంగంలో వృద్ధి 8.84 శాతంగా నమోదైంది. మొత్తం మీద జీఎస్ డీపీ 6.86 శాతంగా నమోదైంది. అంటే సగటున 68 మార్కులు వచ్చాయన్నమాట.
* ఈ సమయంలో మధ్యలో ఆర్థికమంత్రి లేచి మాట్లాడతానని చెప్పగానే స్పీకర్ కోడెల ఆయనకు అవకాశం ఇచ్చారు. దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.
* తర్వాత మళ్లీ వైఎస్ జగన్ మాట్లాడారు. 'వీళ్ల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది. ఇవన్నీ అధికారిక సంస్థలు ఇచ్చిన నివేదికలే. వీటిని సమర్పిస్తాం. వాటిని చదువుకుని, కావాలంటే వాళ్ల సభ్యులకు ట్యూషన్లు కూడా చెప్పుకోమనండి. అలాగే మరో పారామీటర్ తలసరి ఆదాయం' అన్నారు.  
* మరోసారి ఆర్థికమంత్రి యనమల లేచి, తాము అన్నింటికీ సమాధానం చెబుతామని, ప్రతిపక్షమే అనుమతి తీసుకోకుండా వాకౌట్ చేసి సభ నుంచి పారిపోయిందని వ్యాఖ్యానించారు.
* అనంతరం మళ్లీ వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వాకౌట్లకు ఎవరూ అనుమతి ఇవ్వరని, నిరసన తెలుపుతూ ప్రతిపక్షం వాకౌట్ చేస్తుందని, ఆ విషయం గౌరవ మంత్రిగారు తెలుసుకుంటే మంచిదని చెప్పారు.
* తలసరి ఆదాయం విషయానికి వస్తే, 1994లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చేసరికి రూ.15,502గా ఉండేది. చివరకు అది రూ. 23448కి పెరిగింది. ఆ తర్వాత 2008-09లో రాజశేఖరరెడ్డి గారు 46,305కి తీసుకెళ్లారు. 2012-13లో 73,958 వరకు తలసరి ఆదాయం వెళ్లింది.
*  ద్రవ్య నిర్వహణ గురించి మాట్లాడితే, చంద్రబాబు హయాంలో 1994-2004 వరకు ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటే ఉంది. పదేళ్లు కలిపితే ఆయన హయాంలో 21,994 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. తర్వాత 2004-05లో రాజశేఖరరెడ్డి రెండేళ్లలోనే రెవెన్యూ లోటును పూడ్చి, మిగులును సాధించారు. 2004-14లో 10,329 కోట్ల రెవెన్యూ మిగులు సాధించారు.
* ఆస్తులు - అప్పుల నిష్పత్తి చూసుకుందాం. 1994లో ఆస్తులు 101, అప్పులు 100 ఉండేవి. 2004నాటికి ఆస్తులు 44.77శాతానికి పడిపోయాయి, అప్పులు మాత్రం 100 ఉన్నాయి. రాజశేఖరరెడ్డి మళ్లీ ఆస్తులను 139కి తీసుకెళ్లారు. తర్వాత ప్రభుత్వాలు అంత బాగా చేయలేకపోయినా, వాళ్లు 86.59 శాతంగా నమోదు చేశారు. ఈ పదేళ్లలో సగటున ఆస్తులు 103.67, అప్పులు 100.
* మరో కొలమానం జీఎస్ డీపీతో పోలిస్తే మొత్తం అప్పులు. 1994 నాటికి అప్పులు 20.5శాతం. 2004 నాటికి అది 32.4 శాతానికి పెరిగింది. అంటే జీడీపీ పెరుగుదల తక్కువ, అప్పుల పెరుగుదల ఎక్కువ అని తెలుస్తోంది. తర్వాత రాజశేఖరరెడ్డి 28.5కి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2014 నాటికి అది 22.4 శాతంగా నమోదైంది'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

Share this article :

0 comments: