కత్తెర వేయడమే చంద్రబాబు విధానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కత్తెర వేయడమే చంద్రబాబు విధానం

కత్తెర వేయడమే చంద్రబాబు విధానం

Written By news on Friday, September 19, 2014 | 9/19/2014

కత్తెర వేయడమే చంద్రబాబు విధానం
పింఛన్ల జీవోపై వాసిరెడ్డి పద్మ ధ్వజం 
సాక్షి, హైదరాబాద్: రకరకాల షరతులు విధించి ఏదో రకంగా సంక్షేమ పథకాలకు కోత పెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబా బు విధానంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. వృద్ధులకు పింఛన్లను అందకుండా చేయడానికే తాజాగా పింఛన్ల జీవో తెచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నష్టం చేకూర్చే 135 వ జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. ఎన్నికల ప్రచార సమయంలో వృద్ధాప్య పింఛన్లను వె య్యి రూపాయలు చేస్తానని ఆశపెట్టిన చంద్రబాబు ఇప్పుడు తీరా ఎన్నికలయ్యాక, ఇపుడు సమీక్ష పేరుతో పింఛన్ల తొల గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ‘‘జీవో 135 ప్రకారం పింఛన్ల సమీక్షా కమిటీలో ఆ యా గ్రామాల సర్పంచ్‌లు, మునిసిపల్ ఛైర్మన్లు, మేయర్లతో పాటుగా ఇద్దరు స్వయం సహాయక గ్రూపు వారు, మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉంటారని పేర్కొన్నారు.
 
  సహా యక గ్రూపులు, సామాజిక కార్యకర్తల పేరుతో సమీక్షా కమిటీలను టీడీపీ వారితో నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది. హడావిడిగా జీవోను జారీ చేసి 19, 20 తేదీల్లోపు కమిటీలు సమావేశమై పింఛను లబ్ధిదారులను సమీక్షించాలని నిర్ణయిం చడం అన్యాయం. అక్టోబర్ 2 నుంచి పెన్షన్ల మహోత్సవమం టూ దానికి ముందు సమీక్ష పేరుతో వృద్ధుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇది జాతర ముందు బలివ్వడంలా ఉంది. రూ.200 స్వల్ప మొత్తాన్ని కూడా వృద్ధులకు అందకుండా చేయడం దారుణం. ఇప్పటికే 15 లక్షల దరఖాస్తులు అపరిషృ్కతంగా ఉన్నా వాటి గురించి ఆలోచించకుండా ఉన్న వాటిని తొలగించాలని చూడటం విచిత్రం. పింఛన్లు అదనంగా పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తే వారిని తొలగించడానికి అధికారులతో ఒక శాస్త్రీయ ప్రక్రియ ద్వారా చేయాలి తప్పితే ఇలా హేతు రహితంగా కమిటీలను నియమించడమేమిటి? ’’ అని పద్మ మండిపడ్డారు.
Share this article :

0 comments: