ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్

ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్

Written By news on Tuesday, January 27, 2015 | 1/27/2015


ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్
విశాఖపట్నం: పర్యావరణానికి హాని కలిగించే చర్యల కారణంగానే సముద్ర తీరం కోతకు గురవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆర్కే బీచ్ లో కోతకు గురైన ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... సముద్రతీరం కోత అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఈ ముప్పును నివారించడానికి విదేశాల్లో హెడ్ గ్రాయిన్ బ్రేక్ వాటర్ టెక్నాలజీ వాడుతున్నారని తెలిపారు. విదేశీ పర్యటనలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఈ టెక్నాలజీ గురించి తెలియదా అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా మేలుకుని సముద్రతీరం కోతకు గురికాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: