బాబొచ్చే.. మరి జాబేది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబొచ్చే.. మరి జాబేది!

బాబొచ్చే.. మరి జాబేది!

Written By news on Saturday, January 31, 2015 | 1/31/2015

‘వైద్య’ నిరుద్యోగుల ఆగ్రహం
చంద్రబాబు సీఎం అయితే జాబొస్తుందంటూ ఎన్నికల్లో టీడీపీ ప్రచారం
ఎనిమిది నెలలైనా ఒక్క వైద్యుడి పోస్టునూ భర్తీ చేయని వైనం
22 వేల మంది వైద్యుల ఎదురుతెన్నులు
రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగానే పారామెడికల్ అభ్యర్థులు
నోటిఫికేషన్ల జారీపై సర్కారు నిర్లక్ష్యం


సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఎన్నికల సందర్భంగా ’బాబొస్తే జాబొస్తుంది‘ అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఎనిమిది నెలలు గడిచాయి. ఇతర కోర్సులు చేసిన అభ్యర్థుల మాటెలా ఉన్నా.. వైద్య విద్య చదువుకున్న అభ్యర్థులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం దొరకని పరిస్థితి. ప్రభుత్వాసుప త్రుల్లో ఖాళీలు లేక కాదు.. చంద్రబాబు ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేసేందుకు పూనుకోక పోవడమే ఇందుకు కారణం. అమలుకు నోచని బాబు అనేక వాగ్దానాల జాబితాలో ఉద్యోగ ఖాళీల భర్తీ కూడా ఒకటి. ప్రభుత్వం అనేక విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా వేలాది మంది వైద్యులు, పారామెడికల్ అభ్యర్థులు, నర్సులు, టెక్నీషియన్లు లక్షలాదిమంది జాబు కోసం పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. ఇదిగో నోటిఫికేషన్ అదిగో ఉద్యోగం అంటూ మభ్యపెడుతున్న ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబా బు మాట తప్పడంతో వారు సైతం ప్రభు త్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాకు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2003 నుంచి సుమారు 4 వేల మంది పారామెడికల్ ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా రు. వీళ్లందరినీ క్రమబద్ధీకరిస్తానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికి ప్రత్యేకంగా వెయిటే జీ మాత్రం ఇచ్చి ప్రవేశ పరీక్ష నిర్వహించి తీసుకోవాలని మంత్రి వర్గ సంఘం భావి స్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయం తేలేవరకు పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయరాదని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల 1,700 స్టాఫ్ నర్సుల పోస్టులు, సుమారు 3 వేల వరకు పారామెడికల్ పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయాయి.

ఇక వివిధ రకాల టెక్నీషియన్ల (ఈసీజీ, అనస్థీషియా, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్) పోస్టుల ను కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులు చేసి నిరుద్యోగులుగా ఉన్నవారు ఇప్పటికి 3 లక్షల మందికి పైగానే ఉన్నట్టు తేలింది. కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్ధీకరించా లని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుండగా, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వినతుల న్నిటినీ పెడచెవి న పెట్టింది. వీరికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడి ఆరేడేళ్లు అవుతోందనే వాస్తవాన్ని విస్మరించి వ్యవహరిస్తోంది.

వైద్యుల ఖాళీలు గుర్తించినా జాప్యమే
పీజీ వైద్యులకు సంబంధించి 2010 తర్వాత నోటిఫికేషన్ వెలువడలేదు. ఎంబీ బీఎస్‌కు సంబంధించి 2013లో కొన్ని వైద్య ఖాళీలు భర్తీ చేసినా ఇంకా 600 వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రజారోగ్య శాఖలో (డీపీహెచ్) సుమారు 600 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్-ఎంబీబీఎస్ అర్హత) పోస్టుల ను, వైద్యవిధాన పరిషత్‌లో 258 సీఏఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషాలిటీ-డిప్లొమా లేదా పీజీ అర్హత)తో ఖాళీలను గుర్తించారు. అంతేగాకుండా బోధనాసుపత్రుల్లో 324 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీజీ అర్హత)ల ఖాళీలను గుర్తించారు. కానీ నోటిఫికేషన్లు జారీ చేయ కుండా జాప్యం చేస్తున్నారు.

బోధనాసుపత్రుల్లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వైద్యవిధాన పరిషత్ వైద్యుల భర్తీ కూడా ఇందులోనే కలిపి ఉమ్మడి నోటిఫి కేషన్ ఇవ్వాలని కుటుంబ సంక్షేమశాఖ కమిష నర్ ఆదేశించడంతో మళ్లీ జాప్యం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వా రు 15వేల మంది, పీజీ పూర్తి చేసిన వారు  7వేల మంది వరకూ ఉన్నట్టు తేలింది. ఐ దేళ్లుగా ఏ బోధనాసుపత్రి లోనూ పీజీ వైద్యుల భర్తీ జరగలేదు. దీంతో బోధనాసుపత్రుల్లో భారీగా వైద్యుల కొరత ఉంది.

రోగుల ఇబ్బందులన్నా చూడండి
వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీలు భర్తీ చేయకపోవడంలో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 20 మంది రోగులను చూడాల్సిన వైద్యుడు 70 మందిని చూడాల్సి వస్తోంది. పైగా ఖాళీల భర్తీలో జాప్యం జరిగే కొద్దీ ఎక్కువమంది వైద్యులు నిరుద్యోగులుగా మారుతు న్నారు. 2010 నుంచి ఇప్పటివరకు భర్తీ జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ పరిస్థితిని గుర్తించాలి.
- డాక్టర్ కె.వి.పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, ఏపీ జూనియర్ వైద్యుల సంఘం

http://www.sakshi.com/news/andhra-pradesh/paramedical-posts-not-fiiled-in-andhra-pradesh-208452
Share this article :

0 comments: