నాయకులంతా ఒక్కటై.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాయకులంతా ఒక్కటై..

నాయకులంతా ఒక్కటై..

Written By news on Wednesday, January 28, 2015 | 1/28/2015


సమరోత్సాహం
 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1న తణుకులో చేపట్టనున్న రైతు దీక్ష కోసం పార్టీ నాయకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. దీక్షను విజయవంతం చేసేందుకు వివిధ హోదాల్లోని నాయకులంతా జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేశారు. హామీల పరంపరతో అధికారంలోకి  వచ్చి.. ఆనక రైతులను, డ్వాక్రా మహిళలను, అన్నివర్గాల ప్రజలను వంచనకు గురిచేస్తున్న చంద్రబాబు తీరు, సర్కారు విధానాలపై సమరశంఖం పూరించేం దుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రైతు దీక్షకు శ్రీకారం చుడుతున్నారనే విషయాన్ని చాటుతున్నారు. రైతు దీక్షను మన జిల్లాలోనే చేపట్టడానికి గల కారణాలను సైతం వివరిస్తున్నారు. పార్టీ జిల్లా సారథి పిలుపు మేరకు రైతు దీక్షను విజయవంతం చేయడానికి కార్యకర్తలు ఇప్పటికే చొరవ తీసుకోగా, మంగళవారం జిల్లావ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

 నాయకులంతా ఒక్కటై..
 రైతు దీక్షను విజయవంతం చేసేందుకు జిల్లాలోని పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడుస్తూ.. ఎవరికి వారు ప్రత్యేక బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వంక రవీంద్రనాథ్, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య తదితరులు దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్టీ ఎస్టీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, మండల కమిటీ కన్వీనర్లు ఎవరికి వారు రైతు దీక్షకు సంబంధించి ప్రచారం కొనసాగిస్తూ రైతులను చైతన్యవంతుల్ని చేసే పనిలో నిమగ్నమయ్యారు. తణుకులో దీక్షాస్థలి వద్ద మంగళవారం భూమిపూజ నిర్వహించారు.

 పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు వంక రవీంద్రనాథ్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య పాల్గొన్నారు. అనంతరం రేలంగిలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏలూరులో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు ఆళ్ల నాని ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.  నరసాపురంలో పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మంగళవారం నరసాపురం కాలువలో పడవలతో ర్యాలీ నిర్వహించి, రైతు దీక్షకు తరలిరావాలని రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యం లో నిడమర్రులో సమావేశం నిర్వహించగా, నారాయణపురంలో కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేసి రైతు దీక్షపై రైతులకు అవగాహన కల్పించారు. తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపిని దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పోలవరంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, చింతల పూడి, లింగపాలెం మండలాల్లో ఆళ్ల నాని, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఘంటా మురళీరామకృష్ణ,  భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లులో మేకా శేషుబాబు ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. పెనుమంట్ర, మార్టేరు, ఆచంటలో ముదునూరి ప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మేడపాటి చంద్రమౌళీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు  నిర్వహించారు.
Share this article :

0 comments: