దాడి చేసి రాజీ ప్రయత్నాలు చేస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దాడి చేసి రాజీ ప్రయత్నాలు చేస్తారా?

దాడి చేసి రాజీ ప్రయత్నాలు చేస్తారా?

Written By news on Friday, July 10, 2015 | 7/10/2015

హైదరాబాద్: మహిళా తహశీల్దార్ వనజాక్షి పై దాడి చేసి మూడు రోజులు గడుస్తున్నా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తహశీల్దార్ కు ఫోన్ చేసి రాజీకి రావాలని బెదిరించడం సిగ్గుచేటని పద్మ విమర్శించారు. నిజాయతీగా పనిచేస్తున్న అధికారిణిపై దాడి చేసి రాజీ ప్రయత్నాలు చేస్తారా అని పద్మ నిలదీశారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వివరాలన్నింటినీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏయే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో వాటన్నింటినీ మీడియా ముందు ఉంచాలని అన్నారు. విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని భూములతో వ్యాపారం చేస్తూ విదేశాలకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని పద్మ మండిపడ్డారు.
Share this article :

0 comments: