పులివెందులలో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గెలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందులలో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గెలుపు

పులివెందులలో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గెలుపు

Written By news on Friday, February 19, 2016 | 2/19/2016

పులివెందుల : పులివెందులలో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఘన విజయం సాధించింది. పులివెందుల ఆర్టీసీ డిపోలో మొత్తం 466 ఓట్లు ఉన్నాయి. ఇందులో 12 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు. మిగిలిన 454 ఓట్లలో 452 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు 191 ఓట్లు రాగా, ఎంప్లాయీస్ యూనియన్‌కు 148 ఓట్లు వచ్చాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 94 ఓట్లు లభించగా, టీడీపీ అనుబంధ యూనియన్ కార్మిక పరిషత్‌కు కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఎంప్లాయీస్ యూనియన్‌పై వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ 43 ఓట్ల తేడాతో గెలుపొందింది. యూనియన్ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే పులివెందులలో వైఎస్‌ఆర్ మజ్దూర్ యూనియన్ గెలుపొందడం విశేషం. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డిలు ఇందుకు విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీని తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తారన్నారు. ఆర్టీసీ కార్మికులకు వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు.
Share this article :

0 comments: