వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ కమిటీ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ కమిటీ భేటీ

వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ కమిటీ భేటీ

Written By news on Tuesday, August 7, 2012 | 8/07/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ఓ కొత్త పాలసీ సిద్ధం చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నారు. ప్రతిపాదిత పాలసీ సిద్ధం చేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ కమిటీ అందజేయనుంది. దళితులు, గిరిజనుల సమస్యలను పూర్తిగా పరిశీలించి పాలసీ రూపొందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. దేశం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. జగన్‌ సూచనలతో పాలసీ విధివిధానాలు త్వరలో మీడియాకు వివరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జూపూడి ప్రభాకరరావు, గొల్ల బాబూరావు, నల్లా సూర్యప్రకాశ్‌, కుంభ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: