ప్రజాపక్షంగా పోరాటానికి వ్యూహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాపక్షంగా పోరాటానికి వ్యూహం

ప్రజాపక్షంగా పోరాటానికి వ్యూహం

Written By news on Sunday, September 16, 2012 | 9/16/2012


అసెంబ్లీలో ప్రజా వాణి వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం సమావేశమవుతున్నారు. విద్యుత్ సంక్షోభం, తద్వారా ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ రంగాలు దెబ్బతింటున్న అంశం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల భవిష్యత్తు అంధకారంగా మారడం, వ్యవసాయరంగం, ఎరువులు, విత్తనాల కొరత, ఫీజులు, లక్ష్మీపేట ఉదంతం, డీజిల్ ధరలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించి.. అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చూడాలని పార్టీ భావిస్తోంది.

వైఎస్సార్‌సీపీ పక్షాన తొలిసారి అడుగిడుతున్న ఎమ్మెల్యేలు

గత బడ్జెట్ సమావేశాలు ముగిసేనాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో విజయమ్మ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఇద్దరు సభ్యులే ఉండేవారు. ఉప ఎన్నికల్లో 14 మంది పాత ఎమ్మెల్యేలు, ఒక కొత్త ఎమ్మెల్యే (భూమన కరుణాకర్‌రెడ్డి) ఎన్నికయ్యారు. దాంతో ప్రస్తుతం అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ బలం 17కు చేరింది. వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెడుతున్నారు.
Share this article :

0 comments: