అసలు దోషులను వదిలిన సిబిఐ: పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసలు దోషులను వదిలిన సిబిఐ: పద్మ

అసలు దోషులను వదిలిన సిబిఐ: పద్మ

Written By news on Monday, September 17, 2012 | 9/17/2012

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ అసలు దోషులను వదిలివేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎమ్మార్ ప్రాపర్టీస్ కు భూములు కేటాయించడం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, చంద్రబాబుని సిబిఐ రక్షించిందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డిని బదనామ్ చేసే విధంగా సిబిఐ వ్యవహరించిందని ఆరోపించారు. ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం తప్ప సిబిఐ చేసింది ఏమీలేదని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.

వైఎస్ కుటుంబాన్ని, ఆయన మనుషుల్ని కేసులో ఇరికించాలనే సిబిఐ కుట్ర బయటపడిందన్నారు. ఎమ్మార్ కేసులో సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు ఎలా పూర్తి చేసింది? అని ఆమె ప్రశ్నించారు. వందల ఎకరాలు కట్టబెట్టిన చంద్రబాబును సీబీఐ ఎప్పుడైనా ప్రశ్నించిందా? అని అడిగారు. సీబీఐ బరితెగింపునకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. వైఎస్ జగన్ ఆస్తుల లెక్క కావాలంటే చంద్రబాబు స్వయంగా వస్తే చూపిస్తామన్నారు. చంద్రబాబు 2004లో ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ కరెక్టేనా? లేక తాజాగా ప్రకటించిన ఆస్తులు కరెక్టో సమాధానం చెప్పాలని ఆమె అడిగారు.
Share this article :

0 comments: