షర్మిల పాదయాత్ర రూట్ మ్యాప్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల పాదయాత్ర రూట్ మ్యాప్

షర్మిల పాదయాత్ర రూట్ మ్యాప్

Written By news on Sunday, October 14, 2012 | 10/14/2012

ఈ నెల 18 నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం ప్రారంభం అవుతుంది. మొదటి నాలుగు రోజుల రూట్ మ్యాప్ ను వైఎస్ఆర్ సీపీ విడుదల చేసింది. మొదటి రోజు షర్మిల పాదయాత్ర 13 కిలోమీటర్లు కొనసాగుతుంది. మొదటిరోజు పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె, వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుంచి రాజీవ్ నగర్ కాలనీలో షర్మిల పాదయాత్ర చేస్తారు. 

రెండవ రోజు 19.5 కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేస్తారు. రాజీవ్ నగర్ కాలనీ నుంచి ప్రారంభమవుతుంది. నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్నపల్లె, అమ్మయ్యగారిపల్లె, చాగలేరు క్రాస్, వి.కొత్తపల్లి, గొందిపల్లె క్రాస్, వేముల, భూమయ్యగారిపల్లె క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 

మూడవ రోజు భూమయ్యగారిపల్లె క్రాస్ నుంచి వేల్పుల, బెస్తవారిపల్లె, పులివెందుల ఆర్టీసి బస్టాండ్, పులివెందుల పూల అంగళ్ల మీదగా పార్నపల్లె రోడ్డు, రింగ్ రోడ్డు సర్కిల్ నుంచి వైఎస్ఆర్ స్వగృహానికి షర్మిల చేరుకుంటారు. 

నాలుగవ రోజు పాదయాత్ర పులివెందుల రింగ్ రోడ్డు నుంచి చిన్నరంగాపురం, ఇప్పట్ల, చిన్నకుడాల క్రాస్, పెద్దకుడాల క్రాస్, లింగాల, లోపట్నూతల క్రాస్ కు చేరుకుంటుంది. 

అయిదవ రోజు దాదాపు 17 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తారు. లోపట్నూతల క్రాస్ నుంచి కర్ణపాపయపల్లి, వెలిదండ్ల, నేర్జాంపల్లె మీదగా పార్నపల్లె చేరుకుంటారు.
Share this article :

0 comments: