విశ్వసనీయత కోల్పోయిన బాబు: కొణతాల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశ్వసనీయత కోల్పోయిన బాబు: కొణతాల

విశ్వసనీయత కోల్పోయిన బాబు: కొణతాల

Written By news on Monday, October 15, 2012 | 10/15/2012

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన హయాంలో తన ప్రభుత్వం హామీలనే రద్దు చేసి, ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు విశ్వసనీయత ఎప్పుడో కోల్పోయారన్నారు. తన 9 సంవత్సరాల పాలనలో వ్యవసాయ రంగానికి ఎం చేశారో బాబు గుర్తుంచుకోవలన్నారు. వ్యవసాయం గురించి పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు రైతులకు గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని అయినా ఆయన పరామర్శించారా? అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అని ఒక పుస్తకం కూడా ఆయన రాశారని, టూరిజమే మంచిదన్నది చంద్రబాబు భావన అని ఆయన తెలిపారు. బాబు వ్యవసాయం దండగ అని ఒక పుస్తకం కూడా రాసుకున్నారు.
టూరిజమే మంచిదన్నది ఆయన భావన అన్నారు.

ప్రధాన మంత్రిని, రాష్ట్రపతిని తానే ఎంపిక చేశానని చెబుతున్న చంద్రబాబు ఎప్పుడైనా రైతుల రుణాలు రద్దు చేశారా? అని ప్రశ్నించారు. ఆ నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు సమస్యలపై పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.

మరో నేత సోమయాజులు మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు సబ్సిడీలు దండగ అన్నమాట వాస్తవం కాదా? అన్నారు. ఆయన ప్రకటనలపై ఆయనకే స్పష్టత లేదన్నారు. వైఎస్ ఆర్ లాగా ప్రజల్లో విశ్వాసం పెంచుకోవాలి గానీ, ఇలా మొసలి కన్నీరు కార్చితే ప్రయోజనం ఉండదన్నారు. వైఎస్ కృషి వల్లే ఆహార
ధాన్యాల ఉత్పత్తి దాదాపు 50 శాతం పెరిగిందని చెప్పారు. చంద్రబాబు అవిశ్వాసం కాకుంటే కనీసం విశ్వాస తీర్మానం అయినా పెట్టాలన్నారు.


Share this article :

0 comments: