వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరటానికి మాజీ ఎమ్మెల్యేల సంసిద్ధత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరటానికి మాజీ ఎమ్మెల్యేల సంసిద్ధత

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరటానికి మాజీ ఎమ్మెల్యేల సంసిద్ధత

Written By news on Monday, October 15, 2012 | 10/15/2012

వంబర్ 19న ఖమ్మంలో విజయమ్మ సమక్షంలో చేరతా: జలగం
నవంబర్ 11న నేను: సంకినేని


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కాంగ్రెస్), తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు (టీడీపీ) ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలి శారు. విజయమ్మతో వేర్వేరుగా సమావేశమైన వీరిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆ తరువాత వారు మీడియాతో మాట్లాడుతూ తాము వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలను వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కలుషిత రాజకీయ వాతావరణంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం చాలా అవసరమని భావిస్తున్నానని జలగం వెంకట్రావు పేర్కొన్నారు. ఆయన అయితేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరని విశ్వసిస్తున్నానని, అందుకే తాను వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

నవంబర్ 19న ఖమ్మంలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి విజయమ్మ సమక్షంలో తాను, తన అనుచరులు, జలగం కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వివరించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నపుడు తనకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో సత్సంబంధాలుండేవని, ఆయనకూ తమ తండ్రి జలగం వెంగళరావుపై గౌరవం ఉండేదని వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో యంత్రాంగం మొత్తం పడకేసిందని, పరిపాలన కుంటుపడిందన్నారు. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడి అభివృద్ధి పథంలో ముందుకువెళ్లాలంటే అది జగన్ వల్లే సాధ్యమవుతుందన్నారు.

అవకాశవాదులకే బాబు ప్రోత్సాహం...

అవకాశవాదులకే టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చి ప్రోత్సహిస్తారని, ఆయన మాటలకు విశ్వసనీయత లేదని సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన చంద్రబాబు.. జగన్‌ను జైల్లో పెట్టించి తాను అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. తాను పార్టీని వీడుతున్నట్లు వార్తలు రాగానే 2013లో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కబురు పంపారని, ఆయన మాటలకు విశ్వసనీయత లేద ని గ్రహించి తాను జగన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. నవంబర్ 11న సూర్యాపేటలో పెద్ద బహిరంగసభను నిర్వహించి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. 30 ఏళ్లుగా తనతో పాటు టీడీపీలో పనిచేస్తున్న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరతారన్నారు. వీరిరువురూ విజయమ్మను కలిసినపుడు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి గౌతం, బి.జనక్‌ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, ఖమ్మం జిల్లా పార్టీ పరిశీలకుడు గున్నం నాగిరెడ్డి కూడా ఉన్నారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=468966&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: