'ల్యాంకో కోసమే లగడపాటి.. సోనియాకు పాదాభివందనం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ల్యాంకో కోసమే లగడపాటి.. సోనియాకు పాదాభివందనం'

'ల్యాంకో కోసమే లగడపాటి.. సోనియాకు పాదాభివందనం'

Written By news on Saturday, October 19, 2013 | 10/19/2013

విజయవాడ : సంక్షోభంలో ఉన్న తన ల్యాంకో సంస్థను కాపాడుకోవడానికే కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. సోనియా గాంధీకి పాదాభివందనం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, గౌతంరెడ్డి విమర్శించారు. ల్యాంకోకు ఉన్న 40 వేల కోట్ల అప్పుల్లో 9 వేల కోట్ల మాఫీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అందువల్లే లగడపాటి చిత్తశుద్ధిలేని రాజీనామా చేసి పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఆయనకున్న కంపెనీలపై కేసులున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేస్తామని ఇప్పటికీ నోరు మెదపడం లేదని ఉదయభాను, గౌతం రెడ్డి విమర్శించారు.
Share this article :

0 comments: