ప్రజాస్వామ్యం బతికుందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాస్వామ్యం బతికుందా?

ప్రజాస్వామ్యం బతికుందా?

Written By news on Friday, February 21, 2014 | 2/21/2014

ప్రజాస్వామ్యం బతికుందా?: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, రాజ్యసభ వ్యవహరించిన తీరు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం బతికుందా? నిలువునా హత్య చేశారా? అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. లోక్‌సభ, రాజ్యసభ తెలుగుజాతిని అవమానించే కౌరవ సభలుగా తయారయ్యాయన్నారు. అన్ని వ్యవస్థలనూ దిగజార్చి, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తలా ఒక చెయ్యేసి ప్రజాస్వామ్యాన్ని ఖండఖండాలుగా నరికేశారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 వెంకయ్యనాయుడు రాజ్యసభలో బిల్లుకు సవరణలు సూచించినట్లు,  ప్రభుత్వం వాటికి అంగీకరించినట్లు ఇలా డ్రామాను రక్తి కట్టించారన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీపీఎంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు గళం విప్పగా, రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రం కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తిందన్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విభజనకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శిస్తే, ఆ పక్కనే టీడీపీకే చెందిన గుండు సుధారాణి విభజనకు అనుకూలంగా ప్లకార్డు ప్రదర్శించడం దేనికి సంకేతం? ఒకే పార్టీకి చెందిన సభ్యులు ఇలా తెలుగుజాతి పరువును బజారుకీడ్చారని మండిపడ్డారు.
Share this article :

0 comments: